సుబ్బారెడ్డి మీసాలు తిప్పడం దేనికి సూచన
సుబ్బారెడ్డి మీసాలు తిప్పడం దేనికి సూచన
-కేశన్న గౌడ్
డోన్, మార్చి 03 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణంలో సాయి ఫంక్షన్ హాల్ నందు రాష్ట్ర గొర్రెల పెంపకం దారుల చైర్మన్ వై నాగేశ్వర యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కేశన్న, టిడిపి నాయకులు వలసల రామకృష్ణ, సండ్రపల్లే ఆచారి ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... టిడిపి రెబల్ గా ఉన్న ధర్మవరం సుబ్బారెడ్డి శనివారం నిర్వహించిన సభకు కార్యకర్తలు రావడం లో ఏ గొప్ప లేదన్నారు ఎందుకంటే ఆయన టిడిపి ఇన్చార్జి అనే ఒక ఉద్దేశంతోనే కార్యకర్తలు సభకు వచ్చారని అయితే సభకు వెళుతున్న మార్గమధ్యంలో గాంధీ సర్కిల్ దగ్గర మీసాలు తిప్పడం అనేది దేనికి సూచన అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు సీటు ఇచ్చి నన్ను మోసం చేసి నా గొంతు కోశారని బాధపడుతూ చెబుతున్న సుబ్బారెడ్డి ఒకప్పుడు కెఈ ప్రభాకర్ డోన్ కి ఇన్చార్జిగా ఉన్నప్పుడు ఆయన స్థానాన్ని నువ్వు ఆక్రమించినప్పుడు ఆయన ఎక్కడ కూడా ఈ విధంగా అయినా బాధను చూపలేదు చంద్రబాబు నాయుడుని విమర్శించలేదన్నారు. అలాగే ఇద్దరు బీసీ నాయకులను అన్యాయంగా ధర్మవరం సుబ్బారెడ్డి ఇద్దరు బీసీ నాయకులను సస్పెండ్ చేయించినప్పుడు మేము ఎప్పుడూ కూడా పార్టీని దూషించలేదన్నారు. కోట్లా,కేఈ కుటుంబాలు డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేయకపోతే నంద్యాల జిల్లా నుంచి బీసీ జనార్దన్ రెడ్డి మినిస్టర్ అయ్యే అవకాశం ఉందని బీసీ జనార్దన్ రెడ్డికి లేనిపోని ఆశలు కల్పిస్తూ మభ్యపెట్టడం మంచిది కాదన్నారు. 2004 కి ముందు సుబ్బారెడ్డి అంటే డోన్ నియోజకవర్గం లో ఎవరికీ తెలియనిది 2004 సుబ్బారెడ్డికి ఒక గుర్తింపును తెచ్చినది కోట్ల కుటుంబీకులే అటువంటి వారికి డోన్ నియోజకవర్గం అసెంబ్లీ సీటు పార్టీ వారు ఇచ్చినప్పుడు స్వాగతించక దానిని వ్యతిరేకించడం అనేది సరైనది కాదన్నారు. డోన్ నియోజకవర్గం తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థిగా నియమితులైన సందర్భంగా డోన్ లో ఏర్పాటుచేసిన సభకు విచ్చేసిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కేఈ కృష్ణమూర్తి, కెఈ ప్రభాకర్ ల ను కించపరుస్తూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్థానికులు కాకుండా స్థానికేతరులు వచ్చారంటూ మాట్లాడడం తగదని మొదట మీ ముఖ్యమంత్రి చేస్తున్న సిద్ధం సభను జయప్రదం చేసుకోమన్నారు. చెరువులకు నీరు అందించడం కోసమని కోట్ల సుజాతమ్మ కేఈ కృష్ణమూర్తి కేఈ ప్రభాకర్లు వారి పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమై ప్రభుత్వం ద్వారా నీరు తెప్పించారని అటువంటి వారిని అనడం సబబు కాదన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు నాయకుల మెప్పుకోసం ఎలా అంటే అలా మాట్లాడడం తగదని కొద్ది రోజుల్లో ప్రభుత్వం మారబోతుందని తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వస్తుందన్నారు. గతంలో కోట్ల కెఈ వారితో పెట్టుకున్న వాళ్ల పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలన్నారు. ఈ రాక్షస ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలను అనగతొక్కున్నారని చంద్రబాబు వచ్చాక మరల బీసీలకు ప్రాణమస్తుందని ఈనెల 5వ తారీఖున జరిగే జయహో బీసీ సభను విజయవంతం చేస్తామన్నారు. డోన్ లో ప్రస్తుతం బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అభివృద్ధి చేశారు అని కోట్ల కేఈ కుటుంబాలు డోన్ కి అభివృద్ధి చేయలేదు అనడం హాస్యాస్పదమని వారు అభివృద్ధి చేయక ఉంటే డోన్ కి ఇన్ని కార్యాలయాలు ఇన్ని రోడ్లు నీరు ఇవన్నీ వచ్చేవా అన్నారు. కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి 2024లో గెలుపొందిన తరువాత ఇంతకు మూడింతలు అభివృద్ధిని చేసి చూపిస్తామన్నారు.