రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కుటుంబం ఆత్మహత్య
Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
By
Peoples Motivation
రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ కుటుంబం ఆత్మహత్య
కడప, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):-
కడప జిల్లాలో విషాదం నెలకొంది. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరం గ్రామానికి చెందిన సుబ్బారావు రైలు కిందపడి సూసైడ్ చేసుకున్నాడు. అతడి భార్య పద్మావతి, కూతురు వినయ ఇంట్లో బలవన్మరణం చెందారు. రెవెన్యూ అధికారులు మోసం చేశారంటూ ఘటనాస్థలిలో సూసైడ్ నోట్ లభించింది. తమ భూమిని ఇతరులు ఆన్లైన్లో ఎక్కించుకోవడంపై మనస్థాపం తో ఆత్మహత్య చేసుకున్న కుటుంబం. లంచగొండి ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలని చివరిసారిగా లేఖ రాసిన కుటుంబం. మూడెకరాల పొలం అమ్ముదామంటే రికార్డులు తారుమారు చేశారని, మనస్తాపంతో చనిపోతున్నామని లేఖలో రాసి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Kirandhora55
Comment Poster
So sAd
Reply to This Comment
Comments