-Advertisement-

ఎలక్షన్ కమిషన్ కు షాక్... ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి రాజీనామా

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

ఎలక్షన్ కమిషన్ కు షాక్... ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి రాజీనామా

  • రాజీనామాను ఆమోదించిన రాష్ట్రపతి...
  • ఇంకా మూడేళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా....
  • సార్వత్రిక ఎన్నికలకు ముందు షాక్...
  • అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి...

ఢిల్లీ, (పీపుల్స్ మోటివేషన్):-

దేశవ్యాప్తంగా అందరూ ఎలక్షన్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ శనివారం రాజీనామా చేసి ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆమోదించారు. ఆయన పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే... అదీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి కొన్నిరోజుల ముందు రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజీనామా అనంతరం ఇప్పటికే ఒక పోస్ట్ ఖాళీ ఉన్న కేంద్ర ఎన్నికల సంఘంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే మిగిలారు. లోక్ సభ ఎన్నికల తేదీలను వచ్చే వారం ప్రకటించే అవకాశముంది. అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. 2022 నవంబర్ 18న ఆయన వీఆర్ఎస్ తీసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వచ్చే ఏడాది పదవీ విరమణ చేయనుండగా, ఆయన స్థానంలో అరుణ్ గోయల్ నియమితులయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అకస్మాత్తుగా రాజీనామా చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసారు.

EC resigns goel

Comments

-Advertisement-