-Advertisement-

నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు మృతి...

Latest crime news in Telugu, Crime news Telugu, today Crime news, Breaking News Telugu, latest updates in crime news telugu,crime news channels,
Peoples Motivation

నదిలో స్నానానికి వెళ్లి నలుగురు యువకులు మృతి...

కొమురంభీం, మార్చి 25 (పీపుల్స్ మోటివేషన్):-

హోలీ పండగ పూట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హోలీ ఆడిన తర్వాత స్నానం కోసమని వెళ్లి ఐదుగురు మృతి చెందారు. కొమురంభీం జిల్లా కౌటాల మండలం వార్ధా నదిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతు కాగా వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టి.. నాలుగు మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. మృతులు నదిమాబాద్ కు చెందిన సంతోష్, ప్రవీణ్, కమలాకర్, సాయిగా గుర్తించారు. మృతదేహాలను కౌటాల ఆస్పత్రికి తరలించారు. యువకుల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Latest news crime news

Comments

-Advertisement-