-Advertisement-

బుగ్గన ను ఓడించడమే మన లక్ష్యం...ప్రతి ఒక్కరు కష్టపడి టీడీపీ ని గెలిపించుకుందాం..

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

బుగ్గన ను ఓడించడమే మన లక్ష్యం...ప్రతి ఒక్కరు కష్టపడి టీడీపీ ని గెలిపించుకుందాం..

డోన్ నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ ఆత్మీయ సమావేశం

అందరం కష్టపడి వచ్చే ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేసుకుందాం

-మన్నే సుబ్బారెడ్డి

Dhone TDP latest news
డోన్ : మార్చి30(పీపుల్స్ మోటివేషన్)

డోన్ పట్టణంలో తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిసి జనార్ధన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి, నంద్యాల జిల్లా టీడీపీ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ గౌడ్, యువ నాయకులు కోట్ల రాఘవేంద్ర రెడ్డి హాజరయ్యారు.

ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి  మాట్లాడుతూ...

ఆత్మీయ సమావేశం  ముఖ్య ఉద్దేశ్యం అందరికీ తెలిసిందేనని, రెండున్నర సంవత్సరాల నుండి నాతో కలసి కష్టపడి పని చేసిన తెలుగుదేశంపార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. బుగ్గన ను ఓడించాలనే లక్ష్యంతో నెలలో 28రోజులు తెలుగుదేశంపార్టీ కొరకు మనందరం కష్టపడడం జరిగిందని అన్నారు. నా ఎదుగుదలకు కోట్ల కుటుంబంతో పాటు కెయి.ప్రతాప్, బీసి జనార్ధన్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి సహకరించారని, పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని కలిసినప్పుడు కార్యకర్తలు ఎవరైతే కష్టపడ్డారో  వారికి న్యాయం చేయాలని తెలపడం జరిగిందని, కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కూడా న్యాయం చేస్తానని చెప్పారని అన్నారు. నేను డోన్, ప్యాపిలి, బేతంచేర్ల మూడు పట్టణాలలో పర్యటించినపుడు పేదలకు ఇంటి పట్టా ఇవ్వాలనుకున్నానని , కానీ ఇవ్వలేక పోతున్నందుకు బాధ పడుతున్నా అన్నారు. ఏది ఏమైనా గానీ రానున్న ఎన్నికల్లో బుగ్గన ను ఓడించి, ఎమ్మెల్యే గా మన అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి ని, ఎంపీ గా మన పార్లమెంటు అభ్యర్థి బైరెడ్డి శబరి ని గెలిపించుకోని నారా చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు.

Dhone TDP latest news
ఎల్లవేళలా కార్యకర్తలకు మా కుటుంబం అండగా ఉంటుందని అన్నారు. ముఖ్య అతిథులు...  ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి వారి స్వగృహం కు, చాటకొండ శ్రీనివాసులు  ని మర్యాదపూర్వకంగా వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిపి ఆర్.ఈ.రాఘవేంద్ర, డోన్ పట్టణ టీడీపీ అధ్యక్షులు చాటకొండ శ్రీనివాసులు, రాష్ట్ర తెలుగుదేశంపార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి గంధం శ్రీనివాసులు, నంద్యాల జిల్లా టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ప్రజావైద్యశాల బెస్తా మల్లిఖార్జున, యువ నాయకులు ధర్మవరం మన్నే గౌతమ్ రెడ్డి, యువ నాయకులు ధర్మవరం మన్నే భరత్ రెడ్డి, అడ్వకేట్ ఆలా మల్లిఖార్జున రెడ్డి, అడ్వకేట్ మధుసూదన్ గౌడ్, జిల్లా  టి.ఎన్.టి.యూ.సి అధ్యక్షులు అజీజ్, నంద్యాల జిల్లా టీడీపీ కార్యదర్శి అబ్బిరెడ్డిపల్లె గోవిందు, ప్యాపిలి మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి సుదర్శన్, ప్యాపిలి పట్టణ టీడీపీ అధ్యక్షులు భూశెట్టి చిన్న సుంకయ్య, బేతంచేర్ల మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి షేక్షావళి చౌదరి, పెద్దపూదేళ్ళ ప్రసాద్ రెడ్డి, అంకిరెడ్డి, నియోజకవర్గ టీడీపీ బీసీ సెల్ అధ్యక్షులు ఎర్రమల నాయుడు, మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎల్ఐసి శ్రీరాములు, తూర్పు లింగారెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు రాముడు, జిల్లా రైతు కమిటీ ఉపాధ్యక్షులు సత్యం, జిల్లా రైతు కమిటీ కార్యదర్శి జలదుర్గం విష్ణు, బిజెపి రమణ, మైనారిటీ అధ్యక్షులు ఆలంకొండ మస్తాన్,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు చక్రపాణి గౌడ్, నంద్యాల జిల్లా బీసీ కమిటీ నాయకులు మల్లెంపల్లె జయ్యన్న, యాపదిన్నే సర్పంచ్ రామిరెడ్డి, ఉడుములపాడు సర్పంచ్ రామాంజినేయులు, కౌన్సిలర్ రాంమూర్తి, కౌన్సిలర్ మధు, కౌన్సిలర్ రామ గోపాల్, లోకేష్ గౌడ్, బుగ్గనిపల్లె రమేష్, యూనిట్ ఇంచార్జ్ కమలాపురం రమేష్, ఎద్దుపెంట ఈశ్వరయ్య, సుధాకర్ గుప్తా, గండికోట పెద్ద రామాంజినేయులు, ఐటిడిపి హుస్సేన్ పీరా, నియోజకవర్గ రైతు కమిటీ నాయకులు నాగన్న, వేంకటేశ్వర రెడ్డి, జలదుర్గం సలామ్,సింగిల్ విండో డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, డోన్ మండలం టీడీపీ బిసి సెల్ అధ్యక్షులు రామాంజనేయులు, హనుమంత రెడ్డి,జనసేనా బ్రహ్మం, తెలుగుయువత కమిటీ నాయకులు బోరెడ్డి అభిలాష్ రెడ్డి, పట్టణ తెలుగుయువత ప్రధాన సిటీకేబుల్ కిరణ్, కాంత్ బ్రదర్స్, హ్యుమయూన్, మండల తెలుగుయువత అధ్యక్షులు కాశీ, వీరాంజి, డోన్ పట్టణ టీడీపీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి నీలం ప్రభాకర్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

-Advertisement-