విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసుల సస్పెండ్
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసుల సస్పెండ్
కర్నూలు/నంద్యాల, మార్చి 15 (పీపుల్స్ మోటివేషన్):-
ఉమ్మడి కర్నూలు జిల్లాలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అవుకు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ సుబ్రహ్మణ్యం, కానిస్టేబుల్ నందు నాయక్ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవుకు పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఒక మహిళ దారుణ హత్యకు గురైంది. అలాగే అదనపు కట్నం కోసం ఏడు నెలల గర్భిణీ కోడలిని వేధించి ఆత్మహత్యకు పురిగొల్పారనే ఆరోపణలతో కేసు నమోదై జైలుకు వెళ్లిన నేపథ్యంలో ఆలూరు ఏఎస్ఐ తిరుపాలు నాయక్ ను సస్పెండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఆశ్రయించే బాధితుల విషయంలో తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని లేదా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని డీఐజీ హెచ్చరించారు.