అప్పుడే టెట్ ఫలితాలు...
అప్పుడే టెట్ ఫలితాలు...
అమరావతి, మార్చి 21 (పీపుల్స్ మోటివేషన్):-
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో విద్యాశాఖ స్పందించింది. ఎన్నికల సంఘం నుంచి స్పష్టత వచ్చిన తర్వాతే టెట్ ఫలితాలు (AP TET Results) వెల్లడిస్తామని తెలిపారు. మరోవైపు, టెట్లో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు అర్హులు కావడం, డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉండటంతో ఈ ఫలితాలు ఎంతో కీలకంగా మారాయి. షెడ్యూల్ ప్రకారమైతే మార్చి 14వ తేదీనే టెట్ ఫలితాలు వెల్లడి కావాల్సిఉంది. అయితే, అధికారులు ఆ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు ఈసీ నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అధికారిక వెబ్ సైట్ https://aptet.apcfss.in/ లో ప్రకటన చేసింది.