-Advertisement-

మధ్యం మాఫియాకి మధ్య తరగతి కుటుంబాలు బలి.....!

Telugu stories, telugu articles, Telugu editorials, Telugu columns, latest news in Telugu, latest Telugu news, breaking news in Telugu, daily updates
Peoples Motivation

మధ్యం మాఫియాకి మధ్య తరగతి కుటుంబాలు బలి.....!

Thumbnails alcohol
తెలంగాణ ప్రభుత్వం బెల్ట్ షాపు లను రద్దు చేయాలని ఓ పక్క కసరత్తు ఆరంభించింది. అయినా సరే అదనంగా మరో పక్క వీధికో నాలుగు బెల్ట్ షాప్ లు చొప్పున రాష్ట్ర మంతా పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసిఆర్ ముఖ్య మంత్రి కావడం మధ్యం దుకాణాలకు, మధ్య ప్రియులకు, మధ్యం ధరలకు రెక్కలు వచ్చాయి. ఎమ్మార్పీ ధరలకే అమ్మకాలు అంటూ లైసెన్సు షాపులో ఎమ్మార్పీ ధరలకు మధ్యం విక్రయం చేస్తూ ప్రముఖమైన కొన్ని బ్రాండ్లను బెల్ట్ షాపులకు తరలించి షాప్ లలో పది రూపాయలు అదనంగా వసూలు చేస్తూ బెల్ట్ షాపులలో మారో 10 రూపాయల చొప్పున మొత్తం 20 నుంచి 50 రూపాయలు అదనంగా వసూలు చేసి లాభాలు గడించిన ప్రత్యేక తెలంగాణ గా మన రాష్ట్రం గత ప్రభుత్వ కాలంలో మధ్యం తెలంగాణగా రూపు దిద్దుకుంది. నూతనంగా తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఇలాంటి ఆగడాలకు ఇక చెక్కు పడ్డటేననే ఆశలు కుడా గాలిలో కలిసి పోతాయో తెలియదు కానీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెల్ట్ షాప్ లని తొలగించాలి ఆని చాలా సందర్భాల్లో తెలియజేశారు. కానీ రాష్ర్టంలో కొన్ని ప్రాంతాల్లో సిండికేట్ మూస ఫార్ములాతో 20 నుండీ 50 రూపాయల వరకూ మాద్యం తాగే వారి వద్ద నుండీ అధిక వసూళ్లకు దారతీస్తుంది.

విరివిగా మధ్యం అమ్మకాలు........

ఏజెన్సీ ప్రాంతాలే కాదు, పట్టణాల్లో కుడా కనీసం కూరగాయల దుకాణం మొదలుకొని బట్టల షాప్ ల వరకూ నిత్య అవసర సరుకులు అమ్మినట్ల అయా ఆయా మండలాల్లో ఈ మధ్యాన్ని అధిక ధరలకు అమ్ముతువుంటునారు, మధ్యం ప్రియులు ఉదయం 10: 30గంటలకు లైసెన్స్ షాపులు తెరిచే వరకు ఆగలేక విరివిగా లభించే ఈ బెల్ట్ షాప్ ల ద్వారా మధ్యంతోనే మోక్షం కడుకోవడం తో పని పాటలు మని అనేక కుటుంబాలు ఆర్ధిక భారం తో రోడ్డున పడుతున్న సంఘటనలు ఆయా మండలాల్లో మనకు కనిపిస్తూనే వుంటున్నాయి. ఇక చిన్న పిల్లలు అయితే ఈ బెల్ట్ షాపు ల ద్వారానే చాటు మాటు గా మద్యానికి బానిసై విద్య మానేసి తమ ఆరోగ్యాలను, చక్కటి,భవిష్యత్తును తెలిసి తెలియక చింద్రం చేసుకుంటున్నారు.

అధికారుల పట్టింపు యేది....

నేటి బాలలే రేపటి పౌరులు అనే కంటే నేటి బాలలే రేపటి మధ్యం ప్రియులు ఆన్న విధంగా మన తెలంగాణ రాష్ట్రం మారక ముందే చోద్యం చూస్తున్న అధికారులకు తమ విధుల బాధ్యతలను విధిగా గుర్తు చేసినా నిద్ర మత్తులో సంబంధిత అధికారులు.

ప్రభుత్వం అయినా పట్టించుకోవాలి.....

నూతన ప్రభుత్వం మా రాష్టానికి నూతన రూపు మధ్యం సిండికేట్ మాఫియా అక్రమ ఆగడాలను అంత ముందిస్తెనే ఈ మండలాల్లో నీ ప్రజల బ్రతుకులు బాగుంటాయని కొందరు మేదావులు, విశ్లేషకులు, అభిప్రాయపడుతున్నారు.

బీరవేళ్లి అవినాష్

ఎంఏ, ఏంసిజె (జర్నలిజం)

     జర్నలిస్ట్..✍️

Comments

-Advertisement-