నీతికి అవినీతికి మధ్య జరిగే యుద్ధంలో అంతిమ విజయం మాదే..
నీతికి అవినీతికి మధ్య జరిగే యుద్ధంలో అంతిమ విజయం మాదే- కోట్ల
పిట్ట కథలు చెప్పే పిట్టల మంత్రి...
నిధుల విషయంలో అప్పుల మంత్రి...
నియోజకవర్గానికి రేకుల మంత్రి అంటూ తమదైన శైలీలో విమర్శ..
సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానికేతర్లకు ఉద్యోగాలు ఇచ్చి స్థానిక యువతను మోసం చేసింది నువ్వు కాదా..
నీతి నిజాయితీకి మారుపేరు కోట్లకు కుటుంబం..
ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తకు భోజనం పెట్టె సంస్కృతి మాది...
-డోన్ టిడిపి అభ్యర్థి కేంద్ర మాజీమంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి
బేతంచర్ల, మార్చి 10 (పీపుల్స్ మోటివేషన్):-
వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు, రాక్షస పాలనకు ప్రజలు చరమగీతం చెప్పాలని డోన్ టిడిపి అభ్యర్థి కేంద్ర మాజీమంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి కోరారు. ప్రస్తుతం జరగబోయే సాధారణ ఎన్నికలు నీతికి - అవినీతికి మధ్య జరిగే యుద్ధంలో అంతిమంగా విజయం నీతిదేనని అన్నారు. ఆదివారం పట్టణంలోని స్థానిక టిడిపి కార్యాలయం నందు మండల కన్వీనర్ ఉన్నాం ఎల్లా నాగయ్య అధ్యక్షత విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాన్ని పాలించే రాజే అవినీతి పరుడైనప్పుడు రాష్ట్రంలో అరాచకం,దుర్మార్గపు పాలన రాజ్యమేలుతుందని ప్రజలు గమనించాలని అన్నారు. దేశ,రాష్ట్ర స్థాయిలో నిజాయితీకి మారు పేరు కోట్ల కుటుంబమని,కోట్ల కుటుంబన్ని విమర్శించే స్థాయి ఆర్థికమంత్రి బుగ్గనకు లేదని అన్నారు. రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లో కోట్ల కుటుంబం ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులుగా, ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేశామని, రాజకీయ ముసుగులో రాజకీయాల్లోకి వచ్చి దొంగ వ్యాపారాలు చేయడం లేదని అన్నారు. డోన్ నియోజకవర్గంలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని టిడిపి నాయకులపై తప్పుడు కేసులు పెట్టడం, పోలీసులను అడ్డుపెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కోట్ల కుటుంబం నిత్యo ప్రజలకు అందుబాటులో ఉండడంతో, జిల్లా స్థాయిలో నాయకులకు, కార్యకర్తలకు ప్రజల హృదయాల్లో నిలిచిపోయామని అన్నారు. కోట్ల ఇంటికి వచ్చిన ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చి భోజనం పెట్టె సంస్కృతి మాది అన్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని ఎవరూ భయపడాల్సిన పని లేదంటూ ఆయన కార్యకర్తలకు భరోసానిచ్చారు. ఆర్థిక మంత్రి బుగ్గన అసెంబ్లీలో పిట్ట కథలు చెప్పే పిట్టల మంత్రి, నిధుల విషయంలో అప్పుల మంత్రి, నియోజకవర్గానికి రేకుల మంత్రి అంటూ తమ దైన శైలీలో విమర్శించారు. అంతే కాకుండా కోట్ల, కేయి కుటుంబాలు ఏనాడు ఫ్యాక్షన్ నిప్రోత్సహించలేదని, తమ వల్ల 200 మంది వితంతువులుగా మారారంటూ అనవసరమైన విమర్శలు చేస్తున్న ఆర్థికమంత్రి బుగ్గన ఆ 200 మంది వితంతువులను తీసుకువస్తే నేను పోటీ నుండి తప్పుకుంటానని, అలా నిరూపించకపోతే నీవు పోటీ నుండి తప్పుకుంటావా అంటూ సవాలు విసిరారు. ఎన్నికల ముందు సిమెంట్ నగర్ గ్రామంలో సిమెంట్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ చెప్పి అధికారంలోకి వచ్చి తర్వాత స్థానికులను మోసం చేసి స్థానికేతరులకు ఉద్యోగాలు ఇవ్వడం దారుణమని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానికులకే సిమెంట్ ఫ్యాక్టరీ నందు ఉద్యోగాలు కల్పిస్తామంటూ యువతకు భరోసానిచ్చారు. వీటితో పాటు ప్రత్యేక హోదా సాధనకి కృషి చేస్తామని, తద్వారా పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పోలూరు వెంకటేశ్వర రెడ్డి, సీనియర్ నాయకులు పోలురు రాఘవరెడ్డి, భీమేష్ రెడ్డి, బుగ్గన ప్రసన్నలక్ష్మి, జాకీరుల్ల బేగ్, రూబెన్, రవీంద్ర నాయక్, మోహన్ గౌడ్, రంగారెడ్డి, సర్పంచులు శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, కౌన్సిలర్ అంజి, దస్తగిరి, జనసేన నాయకులు చాముండేశ్వరి దేవి, చల్లా మద్దిలేటి, నాగరాజు, రామకృష్ణ అధిక సంఖ్యలో ఆయా గ్రామాల టిడిపి జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు.