ఎన్నికల విధుల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలి..
ఎన్నికల విధుల పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలి..
త్వరలో జరుగనున్న సార్ సార్వత్రిక ఎన్నికలలో పోలీసులు చేయాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ, దిశానిర్ధేశం
-జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి
శ్రీ సత్యసాయి జిల్లా, మార్చి 05 (పీపుల్స్ మోటివేషన్):-
ఎన్నికల విధివిధానాల, విధులు పట్ల పోలీస్ సిబ్బంది అవగాహన కల్గి ఉండాలని జిల్లా ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ సూచించారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో ఎలక్షన్ సెల్ పోలీస్ సిబ్బందికి త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో పోలీసులు పాటించాల్సిన విధి విధానాలు, చేపట్టాల్సిన విధులపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండీ ముగిసే వరకు గల పోలీసుల పాత్ర- విధులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, ఎన్నికలలో అక్రమాలకు అడ్డుకట్ట, శాంతిభద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై ఎస్పీ దిశానిర్ధేశం చేశారు. ఈ శిక్షణలో భాగంగా ఎన్నికలకు సంబంధించిన పలు విషయాలపై క్షుణ్ణంగా అవగాహన చేశారు. ఎన్నికల సమయంలో బాగా పనిచేసి ప్రాధాన్యమైన సమాచారాన్ని పక్కాగా అందించే విధంగా విధులు నిర్వహించాలని సిబ్బందికి ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, దిశా విక్రమ్ , ఎస్బి ఎస్సై ప్రదీప్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.