-Advertisement-

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల వాయిదా... అప్పుడేనా..!

AP tet 2024 Results, ap tet results, ap tet results release, ap dsc shedule, ap dsc exam dates, ap tet key, ap dsc hall tickets, ap tet latest news
Peoples Motivation

టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల వాయిదా... అప్పుడేనా..!

TET RESULTS, DSC EXAMS
రోజు రోజుకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నా సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. షెడ్యూలు ప్రకారం టెట్ పరీక్ష నిర్వహించినప్పటికీ ఫలితాలు విడుదల చేయకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. అయితే ఎంతో మంది అభ్యర్థులు హాస్టల్లో, స్టడీ హాల్స్ కోసం వేల రూపాయలు వెచ్చించి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నారు. సమయానికి పరీక్షలు జరుగుతాయో లేదో అని చాలామంది అభ్యర్థులు పట్టణాలలో హాస్టల్ ఫీజులు కట్టుకోలేక ఇళ్లకు వెళ్లిపోతున్నారు. సంబంధిత అధికారుల నుంచి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఎన్నికల తర్వాతనే పరీక్షలు నిర్వహిస్తారేమోనని తేదీలు దగ్గరకు రావడంతో వాయిదా వేస్తారని అయోమయ స్థితిలో చాలామంది అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. అయితే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డిఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ వీటిపై త్వరగా స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Comments

-Advertisement-