-Advertisement-

ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి...

pulse polio date, pulse polio 2024, pulse polio in telugu, pulse polio programme pdf, pulse polio day in india, pulse polio programme slideshare,
Peoples Motivation

ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన

Thumbnails pulse polio
కర్నూలు, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-

జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పల్స్ పోలియో ర్యాలీకి హాజరైన విద్యార్థులకు ప్రజలకు తెలియజేశారు.

శనివారం ఉదయం ఈ నెల 03 వ తేదీన ఐదేళ్ల లోపు పిల్లలకు పల్స్ పోలియో కార్యక్రమము నిర్వహిస్తున్న సందర్భంగా కలెక్టరేట్ నుండి మెడికల్ కాలేజీ వరకు నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన జెండా ఊపి ప్రారంభించారు.

జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన మాట్లాడుతూ జిల్లాలో ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమంలో అప్పుడే పుట్టిన బిడ్డ నుండి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమం ఆదివారం ఉదయం 7 గంటలకు మొదలై సాయంకాలం 5 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ అవకాశాన్ని తల్లిదండ్రులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం గురించి ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులు మీ పరిసర ప్రాంత ప్రజలకు పల్స్ పోలియోపై అవగాహన కల్పించి పిల్లలకు పోలియో చుక్కలు వేసేలా చూడాలన్నారు. గ్రామ, పట్టణ ప్రాంతాల్లో వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని రైల్వేస్టేషన్లు, బస్ స్టాండ్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బూత్ లలో ప్రజలు తప్పకుండా పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. హైరిస్క్ ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు ఏ ఒక్కరూ మిగిలిపోకుండ పోలియో చుక్కలు వేయాలన్నారు. ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన చిన్నారులకు చుక్కల మందును వేయాలని జిల్లా కలెక్టర్ వైద్య అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, డీఐఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్, డిపిఎంఓ డాక్టర్ ఉమా, డిఈఎంఓ ప్రమీల దేవి, డిప్యూటీ డిఈఎంఓ చంద్రశేఖర్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Thumbnails pulse polio1

Comments

-Advertisement-