అధ్యాపకుడి వృత్తి నుంచి ఎంపీ అభ్యర్థిగా.. సామాన్య కార్యకర్త నుంచి ఎంపీ అభ్యర్థిగా..
అధ్యాపకుడి వృత్తి నుంచి ఎంపీ అభ్యర్థిగా..
- టిడిపిలో సామాన్య కార్యకర్త నుంచి ఎంపీ అభ్యర్థిగా..
- కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థిగా పంచలింగాల నాగరాజు
కర్నూలు, (పీపుల్స్ మోటివేషన్):-
2024 సార్వత్రిక ఎన్నికల మహా సంగ్రామంలో గెలుపే లక్ష్యంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాజకీయ సమీకరణాలు సర్వేల ఆధారంగా కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థిగా కర్నూలు రూరల్ మండలం పంచలింగాల గ్రామానికి చెందిన టిడిపి బీసీ సాధికార రాష్ట్ర సమితి సభ్యుడు, ఎంపీటీసీ బస్తిపాడు నాగరాజు (అలియాస్ పంచలింగాల నాగరాజు) పేరును అధికారికంగా అధిష్టానం ప్రకటించింది.
అభ్యర్థి పేరు: బస్తిపాడు నాగరాజు (పంచలింగాల నాగరాజు)
చదువు& వృత్తి : ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ), బీఈడీ చేసి కొంత కాలం ఆదోని, ఎమ్మిగనూరులోని ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకుడిగా పనిచేశారు. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారం లో దిగి రాణించారు.
స్వగ్రామం& కుటుంబం: పంచలింగాల గ్రామం కర్నూలు రూరల్ మండలం. తల్లిదండ్రులు బస్తిపాడు మహానందమ్మ (లేట్), నాగభూషణం, భార్య జయసుధ (గృహిణి), కుమారుడు కార్తీక్, కూతురు రిషిత.
రాజకీయ నేపథ్యం: ఆయన 2000 సంవత్సరం నుంచే టీడీపీలో సామాన్య కార్యకర్తగా ఉంటూ వచ్చారు. 2021 లో పంచలింగాల ఎంపీసీ సభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా పోటీ. ఇతని మామ పి.శ్రీనివాసులు పత్తికొండ మార్కెట్ యార్డు చైర్మన్ గా పని చేశారు.
పార్లమెంటు పరిధిలో బీసీలు గణనీయం...
వచ్చే ఎన్నికల్లో బీసీలకు మరింత న్యాయం జరిగేలా చూస్తామని టిడిపి అధినేత హామీ ఇచ్చారు కర్నూలు ఉమ్మడి జిల్లాలో దాదాపుగా ఆరు లక్షలకు పైగా కురుబ/కురువ సామాజిక వర్గీయులు ఉన్నారు. అందులో దాదాపు నాలుగు లక్షల మంది కర్నూలు పార్లమెంటు పరిధిలోనే ఉన్నారు. గత 40 సంవత్సరాలలో ఉమ్మడి జిల్లాలో కురువ సామాజిక వర్గీయులు ఏ పార్టీకి టికెట్ ఇచ్చిన దాఖలాలు లేవు ఈ క్రమంలో ఈసారి తమకు ఎంపీ టికెట్ కేటాయించాలని కురుబ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. వారి సూచనలను పరిగణలోకి తీసుకొని కర్నూలు పార్లమెంటు ఎంపీ టికెట్ టిడిపి అధిష్టానం ప్రకటించింది. ఎన్నో రాజకీయ సమీకరణాలు సర్వేల ఆధారంగా విస్తృతంగా చర్చించి చివరికి బస్తిపాడు నాగరాజు (అలియాస్ పంచలింగాల నాగరాజు)కి ఇవ్వాలని నిర్ణయించింది. ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు. పత్తికొండ, మంత్రాలయం నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.
పంచలింగాల నాగరాజు మాట్లాడుతూ...
నాపై ఎంతో నమ్మకం విశ్వాసం ఉంచి కర్నూలు ఎంపీ గా అవకాశం ఇచ్చిన టిడిపి అధినేత చంద్రబాబుకు నాయుడు కి కర్నూల్ పార్లమెంటు స్థానం గెలిచి బహుమతిగా ఇస్తామని. 40 ఏళ్ల తర్వాత కురుబ/ కురువ సామాజిక వర్గం చట్టసభలకు పంపాలనే లక్ష్యంతో ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యే అభ్యర్థులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అన్ని వర్గాల నాయకులు, కార్యకర్తలను కలుపుకొని విజయం సాధించేందుకు కృషి చేసి అది నేతకు కానుక ఇస్తామని. అందరూ నన్ను ఆశీర్వదించి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు.