పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు...రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు...రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
లీకేజీలకు ఆస్కారం లేకుండా కఠిన చర్యలు..
'నో సెల్ఫోన్' జోన్లుగా పరీక్షా కేంద్రాలు..
రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు..
అధికారులకు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ
హైదరాబాద్,మార్చి12 (పీపుల్స్ మోటివేషన్):-
పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా ఉన్నారు. గతంలో 1 అక్రమాలు జరిగిన నేపథ్యంలో పక్కాగా పరీక్షల నిర్వహణకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఈసారి కఠిన ఆంక్షలతో పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద నో సెల్ ఫోన్ జోన్స్ ను ఏర్పాటు చేశారు. పరీక్ష జరిగేంత వరకూ అవసరమైతే జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయించే యోచనలో అధికారులు ఉన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, స్క్వాడ్, సిబ్బందికి ఫోన్లను అందుబాటులో లేకుండా చూడనున్నారు. రూల్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష కేంద్రం నుంచి ప్రశ్న పత్రాలు బయటికి వెళ్లకుండా, మాస్ కాపీయింగ్ జరుగకుండా కట్టుదిట్టంగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఏడాది జరిగిన ఘటనల నేపధ్యంలో ఈసారి పక్కాగా పరీక్షలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదోతరగతి పరీక్షలు జరగనున్నాయి. 5.80 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ఆదేశాలు జారీ చేశారు. పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ క్రమంలో మార్చి 18 నుంచి పదోతరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు ప చేశారు. ముఖ్యంగా సెల్ ఫోన్లు వినియోగంపై అధికారులు కఠిన ఆంక్షలు విధించారు. గతేడాది 1 వాట్సాప్ లో ప్రశ్నపత్రాలు హల్ చల్ చేసిన నేపథ్యంలో అధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షా కేంద్రాలను 'నో సెల్ఫోన్' జోన్లుగా ప్రకటించారు. పరీక్ష సిబ్బంది, స్క్వాడ్ ని సహా ఇతర అధికారులందరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఇక తనిఖీలకు వచ్చే అధికారులు, కలెక్టర్లు, పోలీస్, విద్యాశాఖ ఉన్నతాధికారులు సెంటర్లల్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లడాన్ని అనుమతించరు. వీరు తమ సెల్ ఫోన్లను పరీక్ష కేంద్రం వెలుపలే పెట్టాల్సి ఉంటుంది. పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘించి సెల్ఫోన్ లతో విధులకు హాజరైతే వారిని సస్పెండ్ చేస్తారు. పేపర్ లీకేజీలకు పాల్పడితే ఉద్యోగం నుంచి తొలగిస్తారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పా టు చేశారు. ఆయా తేదీల్లో ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే సైన్స్ పరీక్షకు మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.50 వరకు, ఒకేషనల్ కోర్సుకు ఉదయం 9.30 నుంచి 11.30 గంటల వరకు పరీక్ష జరుగుతాయి. పరీక్షల నిర్వహణ దృష్ట్యా రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఏమైనా సమస్యలుంటే 040-23230942 నంబర్ ను సంప్రదించవచ్చు. ఈ పరీక్షల నిర్వహణ దృష్ట్యా ఇప్పటికే 12 మంది ఉన్నతాధికారులను జిల్లాస్థాయి అబ్జర్వర్లుగా నియమించారు. విద్యార్థుల హాల్ టికెట్లను ఇప్పటికే స్కూళ్లకు పంపించగా, విద్యార్థులు నేరుగా వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్నిచ్చారు. విద్యార్థులు హాల్ టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో పరీక్షాకేంద్రాల సమీప స్టేషన్ వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే ఎస్సెస్సీ బోర్డు నామినల్ రోల్స్, ఫొటో అటెండెన్స్ షీట్లు జిల్లాలకు చేర్చగా, తాజా గా ఓఎమ్మార్, ప్రశ్నపత్రాలు, సమాధానాల రాసే పేపర్లు, బుక్ లెట్లను జిల్లాలకు పంపిస్తున్నది. పదోతరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టిక్కెట్లు మార్చి 7న విడుదలైన సంగతి తెలిసిందే. అధికారిక వెబ్సైట్లో హాల్ టికెట్లను అందుబాటులో ఉంచారు. పదోతరగతి రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ప్రైవేట్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ విద్యార్థుల హాల్ టికెట్లను కూడా విడుదల చేశారు. తమతమ పాఠశాలల లాగిన్ వివరాలతోపాటు.. తమ పేరు, జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. షెడ్యూలు ప్రకారం మార్చి 18న ఫస్ట్ లాంగ్వేజ్, మార్చి 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న థర్డ్ లాంగ్వేజ్, మార్చి 23న మ్యాథమెటిక్స్, మార్చి 26న ఫిజికల్ సైన్స్, మార్చి 28న బయలాజికల్ సైన్స్, మార్చి 30న సోషల్ స్టడీస్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇక ఏప్రిల్ 1న ఓరియంటెల్ పేపర్-1, ఒకేషనల్ కోర్సులకు, ఏప్రిల్ 2న ఓరియంటెల్ పేపర్-2 పరీక్ష నిర్వహించనున్నారు.