-Advertisement-

పిల్లల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి

Polio drops news, polio day, immunization day, polio drops date, polio drops 2024, what is polio drops, what is health issues polio,latest health news
Peoples Motivation

పిల్లల ఆరోగ్యానికి పోలియో చుక్కలు తప్పనిసరి

-జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన

కర్నూలు, మార్చి 03 (పీపుల్స్ మోటివేషన్):-

జిల్లాలో జీరో నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు తమ తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన పేర్కొన్నారు.

ఆదివారం కర్నూలు నగరం ఏ క్యాంప్‌ లోని ఇందిరాగాంధీ స్మారక నగరపాలక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పల్స్‌ పోలియో కేంద్రంలో 0-5 సంవత్సరాలలోపు చిన్నారులకు జిల్లా కలెక్టర్ పల్స్‌పోలియో చుక్కల వేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు వేసి చిన్నారుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేద్దామని కలెక్టర్‌ పేర్కొన్నారు. . 5 సం.లోపు చిన్నారులకు తప్పని సరిగా పోలియో చుక్కలు వేయించాలని అది మనందరి బాధ్యత అని అన్నారు. పల్స్ పోలియో కార్యక్రమంలో నూరుశాతం లక్ష్యాన్ని సాధించాలని తెలిపారు. చిన్నారులు ఆరోగ్యంగా ఉండాలంటే పోలియో చుక్కలు వేయించాలని కోరారు. జిల్లాలో 3,48,071 మంది 5 సంవత్సరాల లోపు పిల్లలకు 1600 పల్స్ పోలియో కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని , అదే విధంగా ప్రయాణంలో ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయుట కొరకు బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలలో 52 కేంద్రాలు ఏర్పాటు చేసామని తెలియచేసారు. ఇటుక బట్టీలు, భవన నిర్మాణ ప్రాంతాలు, సంచార జాతుల గుడారాలు వంటి హై రిస్క్ ప్రాంతాలలో ఉన్న 5సం లోపు పిల్లలకు పోలిచుక్కలు వేయుటకు 63 మొబైల్ బృందాల ద్వారా పోలియో చుక్కలు వేయుదురని తెలిపారు. ఏదేనీ కారణం చేత పోలియో చుక్కలు వేయించుకొని పిల్లలకు ఈనెల 4, 5 మరియు 6 వ తేదీలలో ఇంటింటికీ వైద్య బృందాలు తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు.

పల్స్ పోలియో కార్యక్రమంలో స్టేట్ నోడల్ ఆఫీసర్ రవీంద్రా రెడ్డి,డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య,డీఐఓ డాక్టర్ ప్రవీణ్ కుమార్,డీఈఓ శామ్యూల్ ,వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Thumbnails png polio news

Thumbnails png polio news

Comments

-Advertisement-