కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు.. భయాందోళనకు గురవుతున్న ఇంటి యజమాని...
కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు..
భయాందోళనకు గురవుతున్న ఇంటి యజమాని...
నంద్యాల/రుద్రవరం, మార్చి 28 (పీపుల్స్ మోటివేషన్):-
మండల కేంద్రంలో కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు. గురువారం మండల కేంద్రంలోని బొరుగులపేట కాలని భాస్కర నందీశ్వర స్వామి ఆలయం పరిధిలో అరుణోదయ విద్యా మందిరం వెనుక భాగంలో లింగమయ్య ఇంటి స్థలం ముందు భాగంలో కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు. భయాందోళనకు గురవుతున్న ఇంటి యజమాని లింగమయ్య. ఈ సందర్భంగా ఇంటి యజమాని ఈడిగ లింగమయ్య మాట్లాడుతూ బుధవారం రాత్రి తన ఇంటి ముందర భాగంలో ముగ్గులు వేసి కుంకుమ పసుపు చల్లి టెంకాయ నిమ్మకాయలు పగలగొట్టి నాపై కక్ష సాధింపుతో క్షుద్ర పూజలు చేశారని కావున ఇలాంటి భయాందోళనకు గురి చేసేటువంటి క్షుద్ర పూజలు చేసేవారిని ఉన్నతాధికారులు ఇటువంటి ఆకతాయిలను పసిగట్టి పట్టుకుని కఠినమైన శిక్షలతో ఇలాంటివి మునుముందు చేయకుండా దోషులకు తగిన బుద్ధి చెప్పాలని ఉన్నతాధికారులను ఆయన కోరుతామన్నారు. అలాగే ఇలాంటి క్షుద్ర పూజలు మండల కేంద్రంలో చాలాచోట్ల గ్రామంలోని చిన్నపిల్లలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా జరుగుతున్నాయన్నారు. అందువలన ఉన్నతాధికారులు ఇలాంటి వారిని వెంటనే పట్టుకుని వారిని శిక్షించాలని ప్రజలు కోరుచున్నారు.