కరెంట్ షాక్ తో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి...
పర్వతగిరి మండల మోత్యతండా లో విషాదం
కరెంట్ షాక్ తో ఒకే ఇంట్లో ముగ్గురు మృతి
విషయం తెలియగానే ఘటన స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి అండగా నిలిచిన వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు
వరంగల్, మార్చి 04 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల పరిధిలోని మోత్యతండా లో రేపు దుర్గమ్మ పండుగ నిమిత్తం టెంట్ (పాండా) వేస్తుండగా ప్రమాదవశాత్తు11 కెవి కరెంట్ వైర్లు తెగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సునీల్, దేవేందర్,రవి మరణించగా మరొకరు భూక్యా చిన్ను పరిస్థితి విషమంగా ఉండడంతో ఎంజీఎం హాస్పిటల్ తరలించగా విషయం తెలియగానే హుటా హుటిగా ఘటన స్థలానికి చేరుకొని మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటానని గౌరవ వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. ఎమ్మెల్యే వెంట స్థానిక నాయకులు, జిల్లా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.