-Advertisement-

జయహో బీసీ డిక్లరేషన్

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

జయహో బీసీ డిక్లరేషన్

Thumbnails TDP jayahoo bc
ప్యాపీలి/ నంద్యాల, మార్చి 11 (పీపుల్స్ మోటివేషన్):-

నంద్యాల జిల్లా ప్యాపీలి మండలం హెడ్ క్వార్టర్స్ లో టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వరావు యాదవు ఆధ్వర్యంలో టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

టీడీపీ బీసీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ నాగేశ్వరావు యాదవు మాట్లాడుతూ...

● బీసీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అమలు చేస్తామని పెన్షన్ ను నెలకు రూ.4 వేలకు పెంచుతాం.

● ప్రత్యేక రక్షణ చట్టం : జగన్ పాలనలో 300 మందికి పైగా బీసీలను క్రూరంగా హత్యకు గురయ్యారు. బీసీలపై దాడులు, దౌర్జన్యాల నుండి రక్షణ కోసం 'ప్రత్యేక రక్షణ చట్టం' తీసుకొస్తాం. సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు చేసి హక్కులు కాపాడుతాం.

● బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తాం. వైసీపీ ప్రభుత్వం రూ.75 వేల కోట్ల సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించింది. అధికారంలోకి వచ్చాక బీసీ సబ్ ప్లాన్ నిధులు బీసీల కోసమే వినియోగించేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

● స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ ను వైసీపీ ప్రభుత్వం 34 శాతం నుండి 24 శాతానికి తగ్గించి, 16,800 పదవులు దూరం చేశారు. అధికారంలోకి వచ్చాక 34 శాతం రిజర్వేషన్లు పునరుద్దరిస్తాం. చట్ట సభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తాం.

అన్ని సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్ అమలు.

తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం.

● ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం

 జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం.

దామాషా ప్రకారం నిధులు కేటాయిస్తాం.

స్వయం ఉపాధికి ఐదేళ్లలో రూ.10 వేల కోట్లు ఖర్చు చేస్తాం.

 జగన్రెడ్డి 'ఆదరణ' లాంటి 30 పథకాలు రద్దు చేశారు. రూ.5000 కోట్లతో 'ఆదరణ' పరికరాలిస్తాం.

మండల నియోజకవర్గ కేంద్రాల్లో కామన్ వర్క్ షెడ్స్. ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం.

జగన్ రెడ్డి రద్దు చేసిన పారిశ్రామిక ప్రోత్సాహకాలు పునరుద్దరిస్తాం.

● చట్టబద్దంగా కుల గణన నిర్వహిస్తాం

● చంద్రన్న బీమా రూ.10 లక్షలతో పునరుద్దరిస్తాం. పెళ్లి కానుకలు రూ.లక్షకు పెంపు

● శాశ్వత కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తాం.

● విద్యా పథకాలు అన్నీ పునరుద్ధరిస్తాం

నియోజకవర్గాల్లోని రెసిడెన్షియల్ స్కూళ్లను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం.

షరతులు లేకుండా విదేశీ విద్య అమలు చేస్తాం.

పీజీ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్ మెంట్ పునరుద్దరిస్తాం.

 స్టడీ సర్కిల్, విద్యోన్నతి పథకాలు పునఃప్రారంబిస్తాం.

● బీసీ భవనాలు, కమ్యూనిటీహాళ్ల నిర్మాణాలను ఏడాదిలో పూర్తి చేస్తాం అని వివరించారు.

 ఈ కార్యక్రమంలో వలసల రామకృష్ణ రాష్ట్ర కార్యదర్శి, టీడీపీ మాజీ ఎంపీపీ శ్రీనివాసులు,నంద్యాల జిల్లా బీసీ సెల్ అధికార ప్రతినిధి రామ్మోహన్ యాదవు,ఆర్ ఈ నాగరాజు తెలుగుదేశం నాయకులు చంద్రపల్లె వెంకట రమణచారి, నాగేంద్ర,కోదండ రామయ్య తెలుగునాడు నాయకులు,నంద్యాల జిల్లా తెలుగునాడు సెక్రటరీ అనుదీప్ కుమార్,అక్బర్ పలువురు పాల్గొన్నారు

Thumbnails TDP jayahoo bc

Comments

-Advertisement-