ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా మృతి వారి వివరాలు...
ఘోర రోడ్డు ప్రమాదంలో కుటుంబ సభ్యులంతా మృతి వారి వివరాలు...
నంద్యాల/ఆళ్లగడ్డ, మార్చి 06 (పీపుల్స్ మోటివేషన్):-
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం జాతీయ రహదారిపై నల్లగట్ల గ్రామం దగ్గర కడప నుండి కర్నూల్ రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనకవైపు నుండి కారు ఢీకొనగా కారులో ఉన్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన ఈ రోజు ఉదయం (06-03-2024) 5:50 సమయం లో జరిగినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా ఒకే కుటుంబ సభ్యులు కావడం చాలా బాధాకరం.
మృతులు సికింద్రాబాద్ వెస్ట్ వెంకటాపురం (అల్వాల్) వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతుల వివరాలు... మంత్రి రవీందర్, అతని భార్య లక్ష్మి, బాల కిరణ్, ఉదయ్ కిరణ్ (కుమారులు), కావ్య (కోడలు).. బాల కిరణ్ కు ఇటీవల ఫిబ్రవరి 29 నా కావ్యతో వివాహమైంది. కుటుంబమంతా తిరుమల నుంచి వస్తున్నట్లు తెలిసింది. వివాహమైన వారం రోజుల్లోనే నవ దంపతులు, కుటుంబ సభ్యులంతా మృతి చెందడం చాలా బాధాకరమైన విషయం... ఈ విషయాన్ని వారి బంధువులకు తెలియజేశామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని సీఐ తెలిపారు.