కెవిఎస్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయండి...
కెవిఎస్ హాస్పిటల్ ను వెంటనే సీజ్ చేయండి-తెలుగు విజయ్ కుమార్
డోన్, మార్చ్ 03 (పీపుల్స్ మోటివేషన్):-
డోన్ పట్టణం లో ప్రైవేట్ హాస్పిటల్ అయినా కేవీఎస్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ఉపాధ్యక్షులు తెలుగు విజయ్ కుమార్ మహిళా కాంగ్రెస్ నాయకులు షాహిన్ డిమాండ్ చేశారు..
అనంతరం తెలుగు విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదివారం 03-03-2024 న ఉదయం 9 10 ఆ ప్రాంతంలో మహిళా కాంగ్రెస్ నాయకులు షహీన్ కెవిఎస్ హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం వెళ్ళగా డ్యూటీలో ఉన్న డాక్టర్ అయినా హసీనా నైటీలో ఉండి పేషెంట్లకు వైద్యం చేస్తుండగా ఆశ్చర్యానికి గురైన మహిళ నాయకురాలు మీరు డాక్టర్ ? అని అడగగా డాక్టర్ హసీనా అక్కడే ఉన్నటువంటి యాజమాన్యం శ్రీధర్ మరియు వారి సిబ్బంది మహిళా కాంగ్రెస్ నాయకురాలు షాహిన్ పై అసభ్యకరమైన పదజాలంతో దుర్భాషలాడుతూ ఆమె మొబైల్ లాక్కునే ప్రయత్నం చేసి దౌర్జన్యానికి పాల్పడడం చాలా దుర్మార్గకరమని , అయితే గతంలో కూడా ఈ కెవిఎస్ హాస్పిటల్ పై కేసులు ఉన్నప్పటికీ వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం , మరి యాజమాన్యం మాకు ప్రభుత్వ అండ దండలు ఉన్నాయని డీఎంహెచ్ఓ కూడా తమకే మద్దతుగా ఉన్నారని బహిరంగంగా ప్రకటించుకుంటున్నప్పటికీ ఇది నిజమేనా అని ఆలోచనలో ప్రజలు ఉన్నారని వారిని ఏమి చేయలేరా అని చాలామంది అనుకుంటున్నారని అయితే వారిని ప్రశ్నిస్తున్నప్పటికీ వారు తిరిగి యాజమాన్యం ప్రశ్నించే వారిపైనే కేసులు నమోదు చేయడం చాలా దుర్మార్గమని వారన్నారు..
ఇప్పటికైనా డిఎంహెచ్వో స్పందించి డోన్ లోని కె వి ఎస్ హాస్పిటల్ పై సమగ్ర విచారణ జరిపి వారు చేస్తున్నటువంటి మెడికల్ మాఫియా పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్లో నిబంధనలకు విరుద్ధంగా కాన్పులు చేస్తూ ఉన్న డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.