-Advertisement-

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై తొలి వేటు

latest news telugu,breaking news in india, today latest news in telugu,latest news today, Telugu news updates, breaking news in Telugu, latest news
Peoples Motivation

ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగిపై తొలి వేటు

  • దేశ వ్యాప్తంగా అమల్లో ఉన్న ఎన్నికల కోడ్
  • వైసీపీ తరపున ప్రచారం చేసిన సచివాలయం ఉద్యోగి 
  • విచారణ జరిపించి సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్

శ్రీకాకుళం, మార్చి 17 (పీపుల్స్ మోటివేషన్):-

దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగిపై తొలి వేటు పడింది. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమ్మిలి గ్రామ వీఆర్వో రమేశ్ ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారు. అధికార వైసీపీ పార్టీ నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో రమేశ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించి వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి.దీనిపై జిల్లా కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సమూన్ విచారణ జరిపించారు. రమేశ్ వైసీపీ ప్రచారంలో పాల్గొన్నట్టు విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

VRO SUSPEND IN SRIKAKULAM DIST

Comments

-Advertisement-