-Advertisement-

ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ కు సహకారం... అధికారులపై చర్యలు...

Latest Telugu news, latest updates in Telugu, telugu update news,Telangana news,AP NEWS updates, telugu news updates, ap political updates,ycp updates
Peoples Motivation

ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ కు సహకారం... అధికారులపై చర్యలు...

ఇద్దరు లెక్చరర్లతోపాటు ఎగ్జామ్ సెంటర్ అధికారుల సస్సెన్షన్

కామారెడ్డి, మార్చి 02 (పీపుల్స్ మోటివేషన్):-

కామారెడ్డి జిల్లా సదాశివ్ నగర్ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షల సందర్భంగా మాస్ కాపీయింగ్ కు సహకరించారని ఇద్దరు లెక్చరర్లతో పాటు, ఎగ్జామ్ సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ ఆఫీసర్ లను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం సదాశివ్ నగర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల సందర్భంగా సెంటర్ బయట బ్యాగుతో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా పోలీసులకు కనిపించాడు. వారిని చూసిన వెంటనే బ్యాగ్ వదిలి పారిపోబోగా పట్టుకున్నారు. అతడిని పట్టుకుని ఎంక్వైరీ చేయగా తన పేరు ఎండీ ఇష్రత్అని కాలేజీలో హిందీ లెక్చరర్ ని చెప్పాడు. బ్యాగులో చెక్చేయగా హిందీ ఎగ్జామ్ కి సంబంధించిన చిట్టీలు కనిపించాయి. చిట్టీలను సెంటర్లో ఉన్న లెక్చరర్ రంజిత్ కు ఇచ్చేందుకు వచ్చానని చెప్పాడు. దీంతో లెక్చరర్లు ఇశ్రత్, రంజిత్ పై మాల్ ప్రాక్టీస్ కింద కేసు నమోదు చేశారు. దీంతో స్పందించిన ఇంటర్ బోర్డు లెక్చరర్లు ఇశ్రత్, బి.రంజిత్ తో పాటు ఎగ్జామినేషన్? సెంటర్ సూపరింటెండెంట్ ప్రతాప్ లింగం, డిపార్ట్మెంట్ ఆఫీసర్ రాజాగౌడ్ లను సస్పెండ్ చేశారు. సెంటర్లో కాపీయింగ్ జరగలేదని ఇంటర్మీడియట్ కామారెడ్డి జిల్లా నోడల్ ఆఫీసర్ షేక్ సలాం తెలిపారు. ఇకపోతే రాష్ట్రంలో మరో నలుగురు ఇంటర్ విద్యార్థులపై మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లీష్ ఎగ్జామ్ జరిగగా.. కరీంనగర్ లో ముగ్గురు, నిజామాబాద్ లో ఒక స్టూడెంట్ డిబార్ అయ్యారు. వారిపై అధికారులు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు చేశారు. స్టేట్ ఆబ్జర్వర్లు ఆదిలాబాద్, రంగారెడ్డి, కామారెడ్డి, వనపర్తి, మేడ్చెల్ జిల్లాల్లోని పలు సెంటర్లను తనిఖీ చేశారు. ఇంగ్లీష్ ఎగ్జామ్ కు 5,00,936 మంది అటెండ్ కావాల్సి ఉండగా, 4,80,542 మంది హాజరయ్యారు. మరో 20,394 మంది గైర్హాజరయ్యారు.

Thumbnails png inter exam's

Comments

-Advertisement-