నంద్యాలలో వేసవిలో నీటిఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు
నంద్యాలలో వేసవిలో నీటిఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు
నంద్యాల, మార్చి 05 (పీపుల్స్ మోటివేషన్):-
వేసవికాలన్ని దృష్టిలో ఉంచుకొని నంద్యాల ప్రజలు త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేందుకు మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నీసా, వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంషావలి, కౌన్సిలర్లు, మున్సిపల్ ఇంజనీర్లతో కలిసి ముందస్తు చర్యలను చేపట్టారు. ఈ మేరకు బండిఆత్మకూరు మండలం సంతజూటూరు పికప్ ఆనకట్టను పరిశీలించి త్రాగునీటి అవసరాలకు సంబంధించిన నీటిని నంద్యాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, ఇంజనీర్ మాట్లాడుతూ...నంద్యాల ప్రజలకు వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలను చేపట్టాలని ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు బండిఆత్మకూరు మండలం సంతజూటూరు ఆనకట్టను పరిశీలించడం జరిగిందన్నారు. ఇరిగేషన్ అధికారులు కేసీకి 900 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, అందులో సంతజూటూరు ప్రాంతంలోకి కుందూకు నీరు రావడంతో ఆ నీటిని నంద్యాల ప్రజల త్రాగునీటి అవసరాలకు తరలించే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వెలుగోడు రిజర్వాయర్లో నంద్యాల ప్రజల త్రాగునీటి అవసరాలకు నీటి నిల్వలను చేపట్టడం జరిగిందని, ఈ నీటిని నంద్యాలకు తరలించేందుకు ఎమ్మెల్యే ముందస్తుగా సంబంధిత అధికారులతో చర్చించి ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం జరిగిందన్నారు. రానున్న కాలంలో నంద్యాల ప్రజలకు నీటి సమస్య లేకుండా వచ్చే ఆగస్ట్ నెల వరకు నీటి సమస్య తలెత్తదని తెలిపారు. నంద్యాల ప్రజలు త్రాగునీటి సమస్య ఉండదని ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు.