సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఏసీబీ అధికారుల సోదాలు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్, మరో ఉద్యోగి...
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో ఏసీబీ అధికారుల సోదాలు పట్టుబడ్డ సబ్ రిజిస్టర్, మరో ఉద్యోగి...
మహబూబాబాద్, మార్చి 22 (పీపుల్స్ మోటివేషన్):-
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో లంచం తీసుకుంటూ మహబూబాబాద్ సబెజిస్ట్రార్ తస్లీమా ఏసీబీకి రెండ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. దంతాలపల్లి మండలం దాట్ల గ్రామానికి చెందిన హరీశ్ ఇటీవల 128 గజాల స్థలం కొనుగోలు చేశారు. రిజిస్ట్రేషన్ కోసం గజానికి రూ.200 లంచం ఇవ్వాలని రిజిస్ట్రార్ తస్లీమా డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేనని చెప్పి గజానికి రూ.150 చొప్పున ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. తస్లీమా కు డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు శుక్రవారం రెండ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రూ.19,200 నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బంది దగ్గర ఉన్న రూ.1.70 లక్షలు స్వాధీనం చేసుకొని అతడిని అరెస్టు చేశారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.