జగన్ అంటే భయం అందుకే పొత్తులతో పోటీకి వస్తున్నారు... మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి
జగన్ అంటే భయం అందుకే పొత్తులతో పోటీకి వస్తున్నారు... మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి
నంద్యాల, మార్చి 09 (పీపుల్స్ మోటివేషన్):-
జగన్ అంటే భయమని అందుకే టీడీపీ జనసేన, బిజెపి కలిసి ఎన్నికలలో పోటీకి దిగారని మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని దేవ నగర్, వీసీ కాలనీ, శ్యామ్ నగర్ ల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దేవనగర్ బాషా, కౌన్సిలర్స్ చంద్ర శేఖర్, మాజీ కౌన్సిలర్ లు జాకీర్ హుస్సేన్, దిలీప్ కుమార్ అధ్వర్యంలో పార్టీ కోసం అహర్నిశలు పాటుపడే ఉత్సాహవంతులైన, చాకుల్లాంటి కుర్రాళ్లను టీడీపీ నుండి వైసీపీ లోకి తీసుకు రావడం అభినందనీయం అన్నారు. వీరందరికీ మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ ఇషాక్ భాషా పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానం పలికారు. వైఎస్ఆర్సిపి పార్టీ బలోపేతానికి రానున్న ఎన్నికల్లో సీఎం గా జగన్మోహన్ రెడ్డిని నంద్యాలలో శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి విజయానికి కృషి చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ విజయానికి యువత ఎంతో ప్రాముఖ్యమని యువత తలచుకుంటే సాధించలేనిది ఏదీ లేదని అన్నారు రాష్ట్రంలో యువ నాయకుడైన జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతో పురోగతిని సాధించిందని, మునుపెన్నడూ లేనంతగా అభివృద్ధి సంక్షేమం చేపడుతూ రాష్ట్ర ప్రజల మన్ననలను జగన్మోహన్ రెడ్డి పొందుకున్నారన్నారు. అటువంటి యువనాయకత్వంలో నంద్యాలలో ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపడుతూ ప్రజలకు చేరువయ్యారన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను గుర్తించి పరిష్కరించారని, అలాగే వారందరి ఆధార అభిమానులను చూరగొన్నారన్నారు. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రెండు సంవత్సరాలు కరోనా కష్ట కాలం పోగా మిగతా మూడు సంవత్సరాల్లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారన్నారు. నంద్యాలలో 500 కోట్లతో మెడికల్ కళాశాల, 158 కోట్లతో అమృత్ పథకాన్ని అలాగే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి భవనాల ఆధునికరణ, అర్హులైన పేద ప్రజలందరికీ ఇళ్ల స్థలాలు, గృహాలను అందించారని తెలిపారు . పట్టణాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి రోడ్లు, సీసీ డ్రైన్లు ,కల్వర్టులు, విద్యుత్ స్తంభాలు , నీటి సరఫరా ఇలా అనేక మౌలిక సదుపాయాలను కల్పించారన్నారు. గతంలో ఎందరో ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారం చేపట్టినా , వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రారంభించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో రెట్టించిన ఉత్సాహంతో యువత పనిచేయాలని, వైయస్సార్ పార్టీ బలోపేతానికి ఎమ్మెల్యే శిల్పారవి రెడ్డి , ఎంపీ పోచా బ్రహ్మనందరెడ్డి విజయానికి అహర్నిశలు కృషి చేయాలని కోరారు. మరోసారి రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సీఎంగా అధికారం చేపడితే మరోసారి అవకాశం ప్రజలు అందిస్తే అనేక అద్భుతాలు చేసి చూపిస్తారన్నారు. టిడిపి అధికారంలో ఉన్న సందర్భంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు అనేక హామీలను ఇచ్చారని వాటిలో ఏ ఒక్కటి అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికల వేల చంద్రబాబు నాయుడు మరోసారి ప్రజలను మోసం చేసే హామీలతో ప్రజల వద్దకు వస్తున్నారని, ప్రజలు అటువంటి వాటిని నమ్మవద్దని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి యువత భవిష్యత్తును ఆలోచించే నాయకుడిగా రానున్న కాలంలో విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. వైఎస్ఆర్సిపి పార్టీ విజయానికి ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. నంద్యాల ప్రజలందరి ఆశీస్సులు ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి పై ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో నజీర్, వాసిం , సలీం, హరి,మున్న, వంశీ, ఫారుక్, శివ మరియు వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు వైఎస్ఆర్సిపి అభిమానులు పాల్గొన్నారు.