డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయండి...ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధం
డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయండి...ఇది ఎన్నికల కోడ్ కు విరుద్ధం ఈసీ కి అచ్చెన్నాయుడి లేఖ
అమరావతి, మార్చి 24 (పీపుల్స్ మోటివేషన్):-
డీఎస్సీ పరీక్షల నిర్వహణ, టెట్ ఫలితాల విడుదల ఎన్నికల కోడ్ కు విరుద్ధమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. అధికారులకు పదోన్నతులు కల్పించడం, కొత్త నియామకాలూ కోడ్ ఉల్లంఘనే అవుతాయంటూ ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషనర్ కు ఆదివారం ఆయన లేఖ రాశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 9 వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. షెడ్యూల్ ప్రకారం ఈ ఫలితాలను మార్చి 14వ తేదీన వెల్లడించాల్సింది. కానీ మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వెలువడడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు... అలాగే 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు జరగాల్సిన డీఎస్సీ పరీక్ష నిర్వహణను ఎన్నికల వరకు వాయిదా వేయాలి" అని అచ్చెన్నాయుడు కోరారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంకా పలు అంశాలపై అని ఆయన లేఖలో ప్రస్తావించారు.