టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల అయోమయంలో అభ్యర్థులు...
టెట్ ఫలితాలు, డీఎస్సీ పరీక్షల అయోమయంలో అభ్యర్థులు...
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET) ఫలితాల కోసం అభ్యర్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. షెడ్యూలు ప్రకారం అయితే మార్చి 14వ తేదీన టెట్ ఫలితాలు వెల్లడి కావలసి ఉంది. అయితే అధికారులు ఆ షెడ్యూల్ ప్రకారం విడుదల చేయలేదు. ఈలోపు మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పుడు ఎన్నికల సంఘం నుంచి అనుమతి రాగానే ఫలితాలు విడుదల చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
అయోమయంలో డీఎస్సీ పరీక్ష రాసే అభ్యర్థులు... షెడ్యూల్ ప్రకారం అయితే మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్చికాలు( WEB OPTIONS ) నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పిస్తారని అభ్యర్థులు ఎదురు చూశారు. కానీ దీని గురించి కూడా ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో పరీక్షలు జరుగుతాయో లేదోనని అయోమయంలో ఉన్నామని ఎంతోమంది విద్యార్థులు తెలిపారు. వీటిపై త్వరగా స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు.