ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కనబడుట లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు.!
ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కనబడుట లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదు.!
ప్రొద్దుటూరు, మార్చి 23 (పీపుల్స్ మోటివేషన్):-
ప్రొద్దుటూరు పట్టణంలోని ఓ లాడ్జిలో కర్నూలు జిల్లా కు చెందిన ఉపాధ్యాయుడు ఆత్మహత్య...కర్నూలు పట్టణం లో నివాసం ఉంటున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం లోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు...గత కొద్ది రోజుల క్రితం ఎంఈఓ ఉపాధ్యాయుని సస్పెండ్ చేయడంతో మనస్థాపానికి గురైన ఉపాధ్యాయుడు రెండు రోజుల క్రితం ప్రొద్దుటూరుకు వచ్చారు... ప్రొద్దుటూరు పట్టణంలో ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకొని చేతికి ఉన్న నరాలను కోసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది...కర్నూలు జిల్లాలో ఉపాధ్యాయుడు రాజశేఖర్ శర్మ కనిపించట్లేదని కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు సమాచారం...పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ఈ లాడ్జీ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నట్లు సమాచారం.