వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలు... సమీకరణాలతో తలామునకలైపోతున్న నేతలు..
వేగంగా మారుతున్న రాష్ట్ర రాజకీయాలు... సమీకరణాలతో తలామునకలైపోతున్న నేతలు..
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలకు వేదిక" నంద్యాల"
బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి నంద్యాల కు రాక...
రాష్ట్ర బిజెపి నాయకులు నేడు నంద్యాలకు రాక...
బిజెపి,తెలుగుదేశం పొత్తులపై టెన్షన్,టెన్షన్...
నంద్యాలలో రేపు ఏమిజరగబోతుంది....
టిడిపి, జనసేన, బిజెపి భవితవ్యం తేలనుందా...
రాష్ట్ర బిజెపి అభ్యర్థుల ప్రకటన నంద్యాలలో శ్రీకారం చుట్టనున్నారా...
నంద్యాల, మార్చి 05 (పీపుల్స్ మోటివేషన్)
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనల కు నంద్యాల వేదికగా మారనున్నట్టు తెలుస్తోంది.టిడిపి,వైసిపి అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో ప్రకటించినా బిజెపి పొత్తు అంశం రెండు పార్టీల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. వారం రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు పార్టీ అధిష్టానాల కు మింగుడుపడటం లేదు.పొత్తుల విషయంలో రెండు పార్టీల తో బిజెపి సమన్వయం లోపించడంతో బిజెపి అధిష్టానం పొత్తులు లేకుండా 175 అసెంబ్లీ,25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. బిజెపి పెద్దలు అన్ని నియోజకవర్గములోని బిజెపి పెద్దలు,నాయకులతో అన్ని జిల్లాల్లో సమావేశాలు,సలహాలు,సూచనలు తీసుకున్నారు.నంద్యాల జిల్లాలో బనగానపల్లె లో వైసిపి చేపట్టిన కార్యక్రమం అర్ధాంతరంగా రద్దైంది.అలాగే తెలుగుదేశం పార్టీ నంద్యాల,మైదుకూరు లో చేపట్టిన కార్యక్రమం కూడా అర్ధంతరంగా రద్దు కావడంతో రెండు పార్టీల్లో ఉన్న నాయకుల్లో,కార్యకర్తల్లో అంతర్మధనం మొదలైంది.మరోవైపు వైసిపి,జన సేన,తెలుగుదేశం అధిష్టానాలు ఢిల్లీ పెద్దలతో కలిసే బిజీలో మారిపోయారు. బిజెపి పెద్దలలో పొత్తు అంశం ఈ నెల 9 కానీ 11 న తేలనుందనీ తెలుస్తోంది.ఇప్పటికే రెండు పార్టీల్లో ప్రకటించిన అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది.ఈ నేపథ్యంలోనే రాజకీయ ప్రకంపనల కు వేదిక నంద్యాల మారనుంది.ఉమ్మడి జిల్లాల్లో జరుగుతున్న పరిణామాలు చక్కదిద్దేందుకు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు బుధవారం నంద్యాల కు చేరుకోనుంది.ప్రస్తుతం నంద్యాల బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మధు కార్యాలయం కు ఉమ్మడి జిల్లాలోని బిజెపి నాయకులు,కార్యకర్తలు సమావేశం నిర్వహిస్తున్నారు. బిజెపి తో పొత్తులు లేక పోతే రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి అభ్యర్థుల భవితవ్యం నంద్యాల నుంచే శ్రీకారం చుట్టనున్నట్టు సమాచారం.నంద్యాలలో బిజెపి పార్టీ కి అభిరుచి మధు ఊపునివ్వడంతో కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో పడ్డారు. బిజెపి పార్టీ ఆదేశాల మేరకు ప్రజా పోరు యాత్ర,పల్లె నిద్ర,పట్టణ,గ్రామీణ ప్రాంతాల్లో బిజెపి చేపట్టిన పథకాలు వివరించడంలో సఫలీకృతులు అయ్యారు.నంద్యాలలో స్తబ్దత గా ఉన్న బిజెపి లో నాయకులు,కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.అధిష్టానం ఇచ్చిన ఏ కార్యక్రమమైనా విజయవంతం చేస్తున్నారు.ప్రధాని మోడీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు వివరించారు.పొత్తులు,అభ్యర్థులు,పార్టీ అధిష్టానాలు నంద్యాలలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాక తో ఏమిజరగబోతోందని మేదావులు,రాజకీయ విశ్లేషకులు వేచి చూస్తున్నారు.