-Advertisement-

డిఎస్పీ కొత్త షెడ్యూల్ పరీక్షా తేదీల పూర్తి వివరాలు...

AP DSC Notification 2024 Latest News Today,AP DSC 2024,AP DSC Exam Dates 2024,AP DSC Notification 2024 official website, AP DSC exam new dates,TS DSC
Peoples Motivation

డిఎస్పీ కొత్త షెడ్యూల్ పరీక్షా తేదీల పూర్తి వివరాలు...

విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-

ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 6,100 పోస్ట్ ల ఉపాధ్యాయ నియామకాల కోసం డీఎస్సీ (AP DSC-2024) పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. మార్చి 15 నుంచి డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా.. హైకోర్టు జోక్యంతో మార్పులు చోటుచేసుకున్నాయి. కొత్త షెడ్యూల్ ప్రకారం మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించేలా టైమ్ టేబుల్ ను రూపొందించారు.

షెడ్యూల్ ప్రకారం వివరాలు...

• మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకూ రోజుకు రెండు విడతలుగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు పరీక్ష నిర్వహించనున్నారు.

• ఏప్రిల్ 7న ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ), పోస్టుగ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ), ప్రిన్సిపల్ పోస్టులకు ఆంగ్ల భాష ప్రావీణ్య పరీక్ష నిర్వహిస్తారు. 

• ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకూ స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, వ్యాయామ డైరెక్టర్, ప్రిన్సిపల్ పోస్టులకు పరీక్షలు జరగనున్నాయి.

ఈనెల 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు అభ్యర్థులు వెబ్ ఐచ్చికాలు( WEB OPTIONS ) నమోదు చేసుకొనేందుకు అవకాశం కల్పించనున్నారు.

హాల్ టిక్కెట్లు విడుదల

25 నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి తీసుకొస్తారు. ఆయా పోస్టుల వారీగా పరీక్షల షెడ్యూల్ ఈ కింది విధంగా ఉన్నాయి... లింక్ పై క్లిక్ చేసి చూడండి.

Click here

Comments

-Advertisement-