అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా....
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా....
ఎందరో మహిళామణులు వారి కృషి ద్వారా, పట్టుదలతో అప్పుడున్న సామాజిక పరిస్థితులను దాటుకుని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు వారిలో కొంతమంది గురించి తెలుసుకుందాం...✍️
సావిత్రి భాయ్ పూలే
మహారాష్ట్ర లో దళిత మహిళ గా వివక్షలు ఎదుర్కొని, అవమానాలు ఎదుర్కొని ఆమె భర్త జ్యోతిబా ఫూలే సహాయంతో దేశంలోనే మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు అయ్యారు. మహిళలకు ప్రత్యేక పాఠశాల మొదలుపెట్టారు. కుల వివక్ష, అంటరానితనం, స్త్రీ మీద వివక్షల మీద పోరాడి, విధవలకు, బాలికలకు వారి ఎదుగుదలకు కృషి చేసారు. చివరికి చావు కూడా సేవ చేస్తూనే పొందారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
**********
కార్నెలియా సోరబ్జి
ఈమె దేశంలోనే తొలి మహిళ న్యాయవాది. బొంబాయి యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. ఉన్నత చదువుల కోసం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కి వెళ్లారు. కానీ ఆ సమయంలో మహిళలకు డిగ్రీలు ఇవ్వకపోవడంతో 1894 లో ఇండియా కి వచ్చి, ఎన్నో ఒత్తిళ్లు ఎదుర్కొని తొలి మహిళ న్యాయవాదిగా చోటు దక్కించుకుని, స్త్రీల పరదా వ్యవస్థ మీద ఎంతో పోరాటం చేశారు. స్త్రీ లకు చదువే వద్దు అనుకునే టైంలో ఆమె న్యాయశాస్త్రం అభ్యసించారు.
**********
ఆనంది గోపాల్ జోషి
మన దేశంలోనే తొలి మహిళ డాక్టర్ ఆనంది గోపాల్ జోషి. చిన్న వయసులోనే పెళ్లి, తను పాపా గా ఉన్నప్పుడే మరో బిడ్డకి జన్మని ఇచ్చారు. అనుకోని వ్యాధితో ఆ పాపా 10రోజుల్లోనే చనిపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆమె,నాల ఏ తల్లి నష్టపోకూడదు, బాధపడకూడదు అని 1886లో అమెరికా వెళ్లి ఎండీ చదివారు. ఆ సమయంలో మహిళలు బయటకు అడుగు పెట్టె వాళ్లే కాదు కాని ఈమె డాక్టర్ అయ్యి ఎందరికో ఆదర్శంగా నిలిచారు.
**********
ఎ.లలిత
చిన్నతనంలోనే వివాహం, పిల్లలు కలిగిన కొన్ని ఏళ్లకే కే భర్తని కోల్పోయి 18ఏళ్లకే విధవరాలు అయ్యారు. ఒకవైపు ఆటుపోట్లు మరొక వైపు పిల్లల బాధ్యతలు ఉన్న ఆమె దేశంలోనే మొట్ట మొదటి ఎలక్ట్రికల్ ఇంజినీర్. పెళ్లి కావడం, భర్త పోయి విధవ అవ్వడంతో ఇంట బయట ఎన్నో ఒత్తిళ్లు, అవమానాలు, వ్యతిరేకత ఉన్న ఇంజనీరింగ్ చేయాలన్న తపన ఆమెని నిలబెట్టింది. 1964 లో "అంతర్జాతీయ మహిళా ఇంజినీర్ లు, శాస్త్రవేత్తల సదస్సు" కి ఇండియా నుంచి ఆమె ప్రాతినిధ్యం వహించారు.
**********
అన్నా చాందీ
దేశంలోనే తొలి మహిళా న్యాయమూర్తి, అలాగే దేశంలోనే తొలి మహిళ హై కోర్టు న్యాయమూర్తి అన్నా చాందీ. ఎన్నో ఆటుపోట్లు లింగ బేధాలు, అవమానాలు ఎదుర్కొని వాటిని అధిగమించి 1926లో న్యాయవిద్యలో పీజీ చేశారు. 1937 లో ట్రావెన్కోర్ మునుసబ్ గా నియామకం అయ్యి దేశంలోనే మొదటి మహిళ జడ్జ్ అయ్యారు. 1959 లో కేరళ హైకోర్టు జడ్జి గా మారి చరిత్ర సృష్టించారు.
**********ముత్తులక్ష్మి రెడ్డి
ముత్తులక్ష్మి గారు దేశంలోనే మొట్టమొదటి మహిళ చట్టసభ్యురాలు. 1926లో ఆమె మొదటిసారి మద్రాస్ శాసనమండలి కి ఎన్నికైయ్యారు. 1912 లో మన దేశం నుంచి డాక్టర్ పట్టా పొందిన తొలి మహిళ కూడా ఈమె కావడం విశేషం.అనిబిసెంట్, గాంధీ గారి ప్రోత్సాహంతో స్త్రీ ల అభివృద్ధి కి, వారి స్వేచ్ఛ, హక్కుల కోసం ఎంతగానో పోరాడి ఆదర్శంగా నిలిచారూ.
**********
ప్రియ ఝాంగన్
ఈమె ఆర్మీ లో శిక్షణ తీసుకున్న మొట్టమొదటి మహిళ కాడేట్. 1992 లో భారత సైన్యంలో చేరి చరిత్ర సృష్టించారు. ఆమె స్పూర్తితో మరో 24మంది మహిళలు భారత సైన్యంలో చేరారు, న్యాయవిద్యని అభ్యసించి అడ్వొకేట్ జనరల్ గా సేవలందించారు. 10ఏళ్ళు సైన్యంలో పనిచేసి, 2002 లో మేజర్ గా రిటైర్ అయ్యారు.
**********
సరళ ఠాక్రల్
ఈమె దేశంలోనే తొలి మహిళ పైలట్, 1936లొనే ఆమెకు పైలట్ లైసెన్స్ వచ్చింది. ఆమె "జిప్సీ మాథ్ సోలో" అనే విమానాన్ని 1000 గంటలకు పైగా నడిపి దేశంలోనే ఏ- కేటగిరీ లైసెన్స్ పొందిన మొదటి మహిళ గా నిలిచారు. ఆమె విమానం నడిపేప్పుడే ఆమె కూతురు వయస్సు 4ఏళ్ళు. చీరకట్టులో విమానాన్ని నడిపి భవిష్యత్ తరాలకు ఆదర్శం అయ్యారు.
**********
2024 అంతర్జాతీయ మహిళా దినోత్సవ Theme: 'Invest in Women: Accelerate Progress'
ప్రతి మహిళాకీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు💐🙏
పీపుల్స్ మోటివేషన్ డెస్క్..✍️