మూఢనమ్మకాలు మరో ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్నాయి...
మూఢనమ్మకాలు మరో ఇద్దరి ప్రాణాల్ని బలిగొన్నాయి...
నంద్యాల జిల్లా, చాగలమర్రి టౌన్ కు చెందిన ముస్లిం కులస్తులైన షేక్ ఖాజా హుస్సేన్, అతని భార్య షేక్ ఇమామ్ బీ, బావమరిది అయిన ఫకీర్ మస్తాన్ లు ముగ్గురు కలిసి షేక్ ఇమాంబి ఆరోగ్యం సరిగా లేనందున నంద్యాల జిల్లా ఎర్రగుంట్ల దర్గా వద్ద పూజలు చేశారు...
దర్గాలోని స్వామి చెప్పారని తిరిగి చాగలమర్రికి పోతూ రాజుపాలెం మండలం కూలూరు గ్రామ కుందూ నది వద్ద కుందునదిలో మునిగి చాగలమరికి పోదామని షేక్ ఇమాంబి చెప్పగా కుందునది వద్దకు ముగ్గురు వెల్లి మునిగారు. అయితే షేక్ కాజా హుస్సేన్ కుందునది కట్టపై ఉండగా భార్య అయినా షేక్ ఇమాంబి,( 27) , బావమరిది అయినా ఫకీరా మస్తాన్, (26 ) నీటి వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు కుందునది లోతు నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినారు.
సమీపంలోని రజకులను పీల్చికొచ్చి నీట మునిగిపోయిన అన్నా చెల్లెలు బయటికి తీశారు...అయితే అప్పటికే వారు మృతి చెంది ఉండడంతో జరిగిన సంఘటనపై కాజా హుస్సేన్ ఫిర్యాదు మేరకు రాజుపాలెం ఏఎస్ఐ సిద్దయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..