రైల్వే పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
రైల్వే పోలీసు ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు (ఆర్పీఎఫ్)/ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్స్ (ఆర్పీఎస్ఎఫ్)లో ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖ (రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు) ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 4,660
1. కానిస్టేబుల్: 4,208 పోస్టులు
2. సబ్ ఇన్స్పెక్టర్: 452 పోస్టులు
RRB REGIONS:
అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్మూ అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్టా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్ రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.
అర్హత:
కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి. ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి:
01.07.2024 నాటికి కానిస్టేబుల్ పోస్టులకు 18-28 ఏళ్ల మధ్య; ఎస్సై పోస్టులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి.
ప్రారంభ వేతనం:
నెలకు ఎస్సై పోస్టులకు రూ.35,400/-
కానిస్టేబుల్ పోస్టులకు రూ.21,700/-
ఎంపిక ప్రక్రియ:
రాత పరీక్ష (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు:
ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులు, మహిళలు, ట్రాన్స్ జెండర్, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తులు ప్రారంభం: 15-04-2024.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: 14-05-2024.
పూర్తి వివరాలకు కింది వెబ్సైట్ ను సందర్శించగలరు https://rpf.indianrailways.gov.in/RPF/