పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన
పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన
నర్సంపేట, మార్చి 01 (పీపుల్స్ మోటివేషన్):-
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి 'సూర్యోదయ్' ఈ పథకాన్ని నర్సంపేటలోని తపాల కార్యాలయం ద్వారా ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి రేసు శ్రీనివాస్ తెలిపారు. పెరిగిన విద్యుత్ ఖర్చులు తగ్గించుకోలేక, బిల్లులు కట్టలేక సతమతమవుతున్న వారికి సౌర విద్యుత్ ఖచ్చితంగా ఓ చక్కని అవకాశం. అయితే సౌర విద్యుత్ పలకాలు, మెకాజనిజం ఏర్పాటు చేసుకోవాలంటే మాత్రం తడిసిమోపెడవుతుంది. కేంద్రం సబ్సిడీ ఇచ్చినా కూడా.. ఆ ధరను తట్టుకోలేక జనం సాంప్రదాయ విద్యుత్ సరఫరాపై ఆధారపడుతున్నారు. కేంద్రం ఎంతగా ప్రచారం చేసినా, జనం మాత్రం సౌర విద్యుత్‌వైపు చూడడం లేదు. అయితే ఇప్పుడా పరిస్థితి నుంచి జనాన్ని బయటకు తెచ్చేందుకు కేంద్రం ఓ చక్కటి ప్లాన్ చేసింది.ప్రజలకు రుణ భారం లేకుండా భారీగా సబ్సిడీ ఇస్తూ సోలార్ సిస్టమ్‌ను అందజేసేందుకు ప్రధాన మంత్రి సూర్యోదయ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది.
భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ
దేశంలోని కోటి ఇళ్లలో ఉచితంగా వెలుగులు నింపాలనే ఉద్దేశంతో రూ.75 వేల కోట్లతో ఈ పథకాన్ని తీసుకువచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే పీఎం సూర్య ఘర్ యోజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.78 వేల వరకు సబ్సిడీ పొందనున్నారు. ఈ పథకం పొందేందుకు నర్సంపేట లోని తపాల కేంద్రం ద్వారా అప్లై చేసుకోవాలి అన్నారు
1.ఫోన్ నెంబరు 2.కరెంట్ బిల్లు తప్పనిసరి ఆని
ఈ పథకంలో భాగంగా అర్హులైన వారికి నెలకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఈ పథకం కింద దేశంలోని కోటి కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి. ఈ పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకానికి సంబంధించి రూ.75 వేల కోట్లతో కేబినెట్ తాజాగా గురువారం ఆమోదం కల్పించింది. ఈ పథకం కింద రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునే కుటుంబాలకు రూ.78 వేల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందించనుంది. నర్సంపేటలోని ఈ పథకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నరసింహ రాములు నర్సంపేట బిజెపి పట్టణ అధ్యక్షులు బాల్నే జగన్ బిజెపి సీనియర్ నాయకులు శీలం సత్యనారాయణ యువ మోర్చా పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ ప్రధాన కార్యదర్శి ఠాకూర్ విజయ్ సింగ్ బూత్ అధ్యక్షులు రమేష్ పాండే చెను నరేష్ శక్తి కేంద్ర ఇన్చార్జి ఠాకూర్ శివాంజనేయ సింగ్ మరియు తపాల సిబ్బంది పాల్గొన్నారు.