-Advertisement-

9 గ్యారెంటీలు ఆవిష్కరించిన షర్మిల...ఏపీలో ఆ రెండు పార్టీలు మోదీకి బానిసలే‌

latest news telugu, breaking news in india, today latest news in telugu, latest news today, latest news live 5 latest news headlines latest news world
Peoples Motivation

9 గ్యారెంటీలు ఆవిష్కరించిన షర్మిల...

విజయవాడ, మార్చి 30 (పీపుల్స్ మోటివేషన్):-

ఈరోజు విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏపీలో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికీ తిరిగి ప్రతి ఒక్కరికీ వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారెంటీలను ప్రకటించారు.

AP CONGRESS 9 GARANTEES
9 గ్యారెంటీలు ఆవిష్కరించిన షర్మిల...

1. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే హోదా అమలు

2. మహిళా వరలక్ష్మి పథకం పేరిట ప్రతి పేద మహిళకు నెలకు రూ.8,500

3. రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ

4. రైతులకు పెట్టుబడిపై 50 శాతం లాభంతో కొత్త మద్దతు ధర

5. ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.400 అందజేత

6. రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య 

7. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2.25 లక్షల ఉద్యోగాల భర్తీ

8. ఇల్లు లేని ప్రతి పేద మహిళకు రూ.5 లక్షల పక్కా ఇల్లు

9. అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.4 వేల పింఛను... ఇంట్లో ఎంతమంది అర్హులు ఉంటే అందరికీ పింఛను

ఆ రెండు పార్టీలు మోదీకి బానిసలు: షర్మిల

 రాష్ట్రానికి బీజేపీ ఎలాంటి మేలు చేయకపోయినా... వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారాయని విమర్శించారు. ఏపీలో ఆ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా మారాయని అన్నారు. చంద్రబాబు, జగన్ ఇద్దరూ ఇద్దరేనని... ఒకరిది బీజేపీతో బహిరంగ పొత్తు అయితే, మరొకరిది రహస్య పొత్తు అని ధ్వజమెత్తారు. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని, ఆపై విడిపోయిన చంద్రబాబు, ఇప్పుడు మళ్లీ కలిశాడని ఎద్దేవా చేశారు. ఇక, నిర్మలా సీతారామన్ అయితే జగన్ ను మోదీ దత్తపుత్రుడిగా అభివర్ణించారని షర్మిల వెల్లడించారు.

Comments

-Advertisement-