అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ...ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా...
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ...ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా...
ఛార్జీలు పెంచకుండా కోతలు లేని విద్యుత్ ఇచ్చామన్న టీడీపీ అధినేత
మేం అధికారంలో ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం
రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశాం
మన సభలు జనంతో కలల.. జగన్ సభలు వెలవెల అంటూ ఎద్దేవా
శ్రీకాళహస్తి ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం
శ్రీకాళహస్తి/ తిరుపతి, మార్చి 30 (పీపుల్స్ మోటివేషన్):-
శ్రీకాళహస్తి ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. ఈసారి జగన్‌ను ప్రజలు ఓడించడం ఖాయమని, నిరుద్యోగులు బాధ పడొద్దని తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఉంటుందన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా 8 డీఎస్సీలు పెట్టా.. ఐదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా డీఎస్సీ వేయలేని పాలన జగన్ ది అని విమర్శించారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని చంద్రబాబు ప్రకటించారు ఛార్జీలు పెంచకుండా కోతలు లేని విద్యుత్ సరఫరా చేశామని చంద్రబాబు గుర్తు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం మోపినట్లు పేర్కొన్నారు. రేణిగుంటలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేశామన్నారు. మనం పరిశ్రమలు తెస్తే వైసీపీ నేతలు వాటి నుంచి వసూళ్లు మొదలుపెట్టారని ఎద్దేవా చేశారు. అలాగే రేణిగుంట విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దామని చెప్పారు. నెల్లూరులో కూడా ఒక ఎయిర్‌పోర్టు నిర్మించాలనుకున్నట్లు టీడీపీ అధినేత వెల్లడించారు. టీడీపీ కూటమి సభలు జనంతో కలకలలాడుతుంటే.. జగన్ సభలు వెలవెల బోతున్నాయన్నారు. ఎన్నికల బరిలో ఉన్న స్థానిక అభ్యర్థి గోపాలకృష్ణా రెడ్డి పదవి ఉంటే ఒదిగి పనిచేసే మంచి మనిషి అని చెప్పారు. ఈసారి జనం ఆలోచించి ఓటు వేయాలని చంద్రబాబు కోరారు.