డోర్ టు డోర్ కార్యక్రమంలో 6 పథకాలను వివరిస్తూ ప్రచారం....
డోర్ టు డోర్ కార్యక్రమంలో 6 పథకాలను వివరిస్తూ ప్రచారం...
"బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ" కార్యక్రమం లో పాల్గొన్న గౌరు చరిత రెడ్డి
పాణ్యం నియోజకవర్గం/ ఓర్వకల్లు, మార్చి 05 (పీపుల్స్ మోటివేషన్):-
ఓర్వకల్లు టౌన్ ఎస్సీ కాలని లలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రెండవ రోజు "బాబు ష్యూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ" బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫేస్టో పథకాల గురించి ఇంటింటికీ తిరిగి కరపత్రాలను ప్రజలకు అందజేస్తున్న పాణ్యo మాజీ ఎమ్మెల్య, పాణ్యo టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత రెడ్డి.
ఈ సందర్భంగా గౌరు చరితరెడ్డి మాట్లాడుతూ... ముఖ్యంగా ఎస్సీ కాలనీలో త్రాగునీటి సమస్యతో బిందెలతో కోళాయి దగ్గర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఆరుసార్లు ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కాదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేయలేదని ఆరోపించారు.
మహానాడులో సూపర్ సిక్స్ పేరుతో మినీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు.మహిళల కోసం మంచి పథకాలు పొందుపరిచారన్నారు.
ఇందులో భాగంగా ఆడబిడ్డ నిధి కింద 18 ఏళ్లు పైబడిన మహిళలకు నెలకు 1500 చొప్పున సంవత్సరానికి 18 వేల రూపాయలు,
తల్లికి వందనం పథకం కింద పిల్లలను స్కూలుకు పంపే ప్రతి తల్లికి ఒక్కొక్కరికి 15000 చొప్పున ఎంతమందిని బడికి పంపిస్తే అంతమందికి వర్తింపజేసేలా,
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,ఏడాది 3 గ్యాస్ సిలిండర్లు ఇంటింటికి సురక్షిత మంచినీరు ఇలాంటి పథకాలు ప్రజలకు అందుబాటులోకి ఇచ్చి వారిని పూర్ టు రిచ్ అయ్యేలా పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని అలాగే పాణ్యo అభివృద్ధి చెందాలంటే సైకిల్ గుర్తుపై ఓటు వేసి గౌరు చరిత రెడ్డి అనే నన్ని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల టౌన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు