జూన్ 4 తర్వాతే డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలు..స్పష్టం చేసిన ఈసీ
జూన్ 4 తర్వాతే డీఎస్సీ పరీక్షలు, టెట్ ఫలితాలు
ఎన్నికల ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ పరీక్షల వాయిదా
ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని
-స్పష్టం చేసిన ఈసీ
అమరావతి, మార్చి 30 (పీపుల్స్ మోటివేషన్):-
ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయ నియామక పరీక్ష (డీఎస్సీ) నిర్వహణపై ఎట్టకేలకు తెరపడింది. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో డీఎస్సీ పరీక్షల వాయిదా పడింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు డీఎస్సీ పరీక్షలు జరగాల్సి ఉండగా, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని ఈసీ ఆదేశించింది. దీంతో జూన్ 4 తర్వాత డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి.
మార్చి 20 నుంచి పరీక్షా కేంద్రాల వెబ్ ఆప్షన్లు, 25 నుంచి హాల్ టికెట్ల డౌన్‌లోడ్ జరగాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు పరీక్ష కేంద్రాల వెబ్ ఆప్షన్ ఎంపికకు అవకాశం ఇవ్వలేదు. ఇక ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీలో డీఎస్సీ వాయిదా పడింది. ఎన్నికల కోడ్ ముగిసే వరకు డీఎస్సీ పరీక్షల ని వాయిదా వేయాలని సీఈసీ స్పష్టం చేసింది. అలాగే ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను కూడా విడుదల చేయకూడదని ఈసీ వెల్లడించింది.