పోస్టల్ బ్యాలెట్ కు అర్హులు ఎవరు అర్హులు.? 33 శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
పోస్టల్ బ్యాలెట్ కు ఎవరు అర్హులు.? 33 శాఖల సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం
-నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మార్ మీనా
అమరావతి, మార్చి 26 (పీపుల్స్ మోటివేషన్):-
పోస్టల్ బ్యాలెట్ ఎందుకు.?
ఎన్నికల రోజు పోలింగ్ విధులతోపాటు వివిధ నిత్యావసర సేవల్లో ఉంటూ పోలింగ్ రోజు గైర్హాజరయ్యే ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మార్ మీనా మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. రాష్ట్రంలో లోక్ సభ తో పాటు అసెంబ్లీ కీ త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో వివిధ సేవల్లో నిమగ్నమయ్యే 33 శాఖలకు చెందిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
పోస్టల్ బ్యాలెట్ కు ఎవరు అర్హులు.?
మెట్రో రైలు, రైల్వే రవాణా సేవలు, పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి ఎన్నికల కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ చేయబడిన మీడియా వ్యక్తులు, విద్యుత్ శాఖ, బీఎస్ఎన్ఎల్, పోస్టల్- టెలి గ్రామ్, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, రాష్ట్ర మిల్క్ యూనియన్, మిల్క్ కో-ఆపరేటివ్ సొసైటీలు, ఆరోగ్య శాఖ, ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్మెంట్, విమానయానం, రోడ్డు రవాణా సంస్థ, అగ్నిమాపక సేవలు, ట్రాఫిక్ పోలీస్, అంబులెన్స్ సేవలు, షిప్పింగ్, అగ్ని మాపక శాఖ, జైళ్లు, ఎక్సైజ్, వాటర్ అథారిటీ, ట్రెజరీ సర్వీసెస్, అటవీ శాఖ, సమాచార, ప్రజా సంబంధాల శాఖ, పోలీస్, పౌర రక్షణ-హోంగార్డులు, ఆహార పౌర సరఫరాలు- వినియోగదారుల వ్యవహారాలు, ఇంధన శాఖ, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, డిపార్ట్మెంట్ ఆఫ్ పీడబ్ల్యూడీ, నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్, విపత్తు నిర్వహణ సంస్థ ఉద్యోగులు.
ఇందుకోసం ప్రత్యేకం నోడల్ అధికారిని నియమించడంతోపాటు పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి 12-డి పత్రాలను అందుబాటులో ఉంచుతారు. పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం పొందిన ఓటర్లకు ఆ విషయం గురించి తెలియజేస్తారు.