ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.300 కు పెంపు...
ఉపాధి హామీ కూలీల కనీస వేతనం రూ.300 కు పెంపు...
- హరియాణాలో అత్యధికంగా రూ.374..
- అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లలో అత్యల్పంగా రూ.234..
డిల్లీ, మార్చి 29 (పీపుల్స్ మోటివేషన్):-
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరంలో (2024-25) రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కూలీల కనీస వేతనం రూ.300గా నిర్ణయించింది. ఈ ఏడాది (2023-24)కి సంబంధించి కనీస వేతనం రూ.272గా అమలు చేస్తున్నారు. అదనంగా మరో రూ.28 పెంచి 2024-25 సంవత్సరానికి రూ.300గా కేంద్రం నిర్ణయించింది.. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. సవరించిన లెక్కల ప్రకారం.. నైపుణ్యం లేని కార్మికులకు ఈ పథకం కింద చెల్లించే రోజువారీ వేతనం హరియాణాలో అత్యధికంగా రూ.374గా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్లలో అత్యల్పంగా రూ.234 ఉన్నట్లు నోటిఫికేషను పేర్కొంది. లోక్సభ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈసీ నుంచి అనుమతి వచ్చాక.. ఈ వేతనాల సవరణను కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ మార్చి 27న నోటిఫై చేసింది.