-Advertisement-

300 యూనిట్ల ఫ్రీ కరెంట్...

pm surya ghar yojana telugu, pm surya ghar yojana details,pm surya ghar online application, pm surya ghar login,pm surya ghar yojana csc login details
Peoples Motivation

300 యూనిట్ల ఫ్రీ కరెంట్...

సోలార్ విద్యుత్ పెంచే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అడుగులు

సాంప్రదాయ వనరుల వినియోగం దిశగా కేంద్ర ప్రభుత్వం... 

ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన... 

కోటి కుటుంబాలకు 78 వేల కోట్ల రూపాయల రాయితీ

డిల్లీ (పీపుల్స్ మోటివేషన్):-

సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం కోటి కుటుంబాలకు రూ. 78,000 రాయితీ అందించనునంది. మిగిలిన మొత్తాన్ని సదరు ఇంటి యజమాని భరించలేని పక్షంలో వారికి బ్యాంకు ద్వారా రుణం అందించనున్నారు. ఎండ ఉన్న రోజులో 1 KW సౌర విద్యుత్ ప్లాంట్ ఒక రోజులో 4 నుండి 5.5 యూనిట్లను ఉత్పత్తి చేయగలదు.

పిఎం సూర్యఘర్ యోజన పథకం కింది రూప్ టాప్ సోలార్ విద్యుత్ వ్యవస్థ కోసం కేంద్రం 2 కిలోవాట్ సిస్టమ్ ఖర్చులో 60 శాతం, 2-3 కిలోవాట్ల మధ్య ఉన్న సిస్టమ్కి రూ.40 శాతం అదనపు ఖర్చు ఇవ్వబడుతుందని అధికారిక ప్రకటన తెలిపింది. ఆర్థిక సాయం 3 కిలోవాట్ల వరకే పరిమితం చేయబడుతుంది.దీని ప్రకారం... 2 KW సోలార్ ప్యానెల్ కెపాసిటీ కలిగిన వ్యవస్థను ఏర్పాటు చేసుకునే ఇళ్లకు కిలోవాట్ కి రూ. 30,000 చొప్పున సబ్సిడీ ఉంటుంది. 3 కిలోవాట్లకు అదనపు సామర్థ్యం కోసం మరో కిలోవాట్ కి రూ. 18,000 సబ్సిడీగా ఇవ్వనుంది.

PM సూర్య ఘర్ యోజనను భారత ప్రభుత్వం 13 ఫిబ్రవరి 2024న ప్రారంభించింది. PM సూర్య ఘర్ యొక్క ఉద్దేశ్యం: ముఫ్త్ బిజిలీ యోజన దేశంలోని కోటి కుటుంబాలకు 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించడం. PM సూర్య ఘర్ యోజన కోసం ఆన్‌లైన్ అప్లికేషన్ 13 ఫిబ్రవరి 2024న ప్రారంభించబడింది.

ఆసక్తి గల వ్యక్తి PM Suryaghar: Muft Bijli Yojana కోసం pmsuryaghar.gov.in వెబ్‌సైట్ నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో దశలవారీ గైడ్ క్రింద ఇవ్వబడింది.

తమ ఇళ్లపై రూఫ్‌టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవాలనుకునే పౌరులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ దశలను అనుసరించవచ్చు.

ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కోసం దరఖాస్తు చేయడానికి ఈ దశలను అనుసరించండి

ఫేజ్ 1 :

👉కింది దశలతో ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన పోర్టల్‌లో నమోదు చేసుకోండి

pmsuryaghar.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించండి


ఫేజ్ 2 :

👉వినియోగదారు నంబర్ & మొబైల్ నంబర్‌తో లాగిన్ చేయండి

👉ఫారమ్ ప్రకారం రూఫ్‌టాప్ సోలార్ కోసం దరఖాస్తు చేసుకోండి

ఫేజ్ 3 :

👉దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసి డిస్కమ్ నుంచి అనుమతులు వచ్చే వరకు వేచి ఉండాలి. అనుమతి వచ్చిన తర్వాత మీ డిస్కంలోని నమోదిత విక్రేతల నుంచి సోలార్ ప్లాంట్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.

ఫేజ్ 4 :

👉ఇన్‌స్టాలేషన్ పూర్తయిన తర్వాత, ప్లాంట్ వివరాలను సమర్పించి నెట్ మీటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.

ఫేజ్ 5 :

👉నెట్ మీటర్ ను ఇన్స్టాల్ చేశాక డిస్కమ్ అధికారులు తనిఖీ చేస్తారు అనంతరం పోర్టల్ నుంచి కమిషన్ సర్టిఫికెట్ ఇస్తారు.

ఫేజ్ 6 :

👉ఈ నివేదిక పొందిన తర్వాత మీ బ్యాంకు ఖాతా వివరాలతో పాటు క్యాన్సిల్ చెక్కును వెబ్సైట్లో సబ్మిట్ చేయాలి నెల రోజుల్లోగా మీ ఖాతాలో సబ్సిడీ జమ చేస్తారు.

PM సూర్య ఘర్ యోజన అధికారిక వెబ్‌సైట్ యొక్క ప్రత్యక్ష లింక్ ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి

pmsuryaghar.gov.in

ఈ విధంగా పర్యావరణ రహిత విద్యుత్తును పొందడానికి ఈ పథకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Thumbnails pm Surya Ghar yojana

Comments

-Advertisement-