నేడే ప్రపంచ అడవి దినోత్సవం ( మార్చి 21 )
భూమి పై జీవన చక్రాన్ని సమతుల్యం చేయడానికి అడవుల విలువలు ప్రాముఖ్యత మరియు సహకారం గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం మర్చి 21 న ప్రపంచ అడవి దినోత్సవం జరుపుకుంటాం. అంతర్జాతీయ అటవీ దినోత్సవం 2024, 'అడవులు మరియు ఆవిష్కరణ' అనే థీమ్ తో జరుపుకుంటాము.
అడవులు జీవకోటి కి ఆధారం మానవ మనుగడ సాగించాలి అంటే అడవుల పాత్ర మాటల్లో చెప్పలేనిది, సకాలంలో వర్షాలు పడాలి ఆన్న వాతావరణంలో కాలుష్యం ఏర్పడకుండా వుండాలి ఆన్న వాతావరణ సమతుల్యత కాపాడుకోవాలి ఆన్న అడవులే కీలకం. అడవులతోనే మానవుల మనుగడ ఆని తెలిసినా అడవుల రక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పర్యావరణ సమస్యలు ఉత్పనం అవుతున్నాయి, పట్టణాలు, వ్యవసాయం, ప్రాజెక్టులు, పరిశ్రమలు, రోడ్ల నిర్మాణం, పొడు వ్యవసాయం, గృహ నిర్మాణం, వంటి కారణాలతో అడవులు అంతరించి మానవ మనుగడ కు పర్యావరణ సమతుల్యతకు సవాల్ గా మారింది.
పరుచుకున్న పచ్చదనం పారేటి సలయెళ్ళ గలగలలు, పక్షుల కిల కిల రాగాలు, తీరొక్క వన్య ప్రాణులు, నింగిని తాకేలా బారి వృక్షాలు. జీవరాశి మనుగడలో అత్యంత అవశ్యకాలో చెట్లది అగ్ర స్థానం, జీవన ఆధారమైన గాలి, ఆహారం, వాటి నుంచే లభ్యం అవుతాయి.
సహజ సిద్దంగా ఏర్పడిన చెట్లను నరకడం, అడవులు అంతరించి పోవటం వలన జంతువులకు ప్రాణ సంకటంగా మారుతుంది, ఆహారం, నీరు, లభించక అడవులలో వుండవలసిన జంతువులు జనావాసలలో చొరబడుతున్న ఘటన అనేకము చూస్తున్నాం.ఈ రీతిగా అడవి సంపదను ద్వంసం చేయటం వలన అడవి ప్రాంతం నిర్మూలన వలన ఆ ప్రదేశం మొత్తం పొడి వాతావరణం ఏర్పడుతుంది,వాతావరణంలో తేమ తగ్గిపోవడం తో పాటు భూమి లో నీటి శాతం భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. అంతే కాకుండా భూమి సంయోగానీ తగ్గిస్తుంది, అడవులు అంతరించి పోతున్న క్రమం లోనే ప్రకృతి వైపరీత్యాలు మనిషిని అతలా కుతలం చేస్తున్నాయి. అడవులు ఇతర సహజ సిద్ధమైన వనరులకు నష్టం కలిగించడంను అంటే ఆర్ధిక వ్యవస్థలను నష్టం చేయడమే.
పర్యావరణ వ్యవస్థ పునరుద్దరణ అడవుల పెంపకం ద్వారా నే సాద్యం, వాతావరణ మార్పు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. జీవ వైవిద్యం నీ కాపాడటం లో అడవుల పాత్ర కీలకం. అయితే అడవులను రక్షించే అందుకు ప్రత్యెక మైన వృక్ష జాతులను రక్షించేందుకు అందరూ కృషి చేయాలి. పర్యావరణ పరిరక్షణకు అందరూ నడుం బిగించాలి.
బీరవెళ్లి అవినాష్ జర్నలిస్ట్
ఎంఏ, ఏంసిజె (జర్నలిజం)