ఏపీ ఈఏపీ సెట్-2024 షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన సమాచారం
ఏపీ ఈఏపీ సెట్-2024 షెడ్యూల్ విడుదల.. ముఖ్యమైన సమాచారం
కాకినాడ, మార్చి 12 (పీపుల్స్ మోటివేషన్):-
ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈఏపీ సెట్-2024 దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభమైనట్లు ఈఏపీ సెట్ చైర్మన్, జేఎన్ టీయూకే వీసీ డాక్టర్ జీవీఆర్ ప్రసాదరాజు చెప్పారు.
ముఖ్యమైన తేదీలు:-
APAPCET 2024 నోటిఫికేషన్ విడుదల:- 11.03.2024
ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభం తేదీ:- 12.03.2024
ఆలస్య రుసుము లేకుండా ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: -15.04.2024
రూ.500/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:- 30.04.2024
రూ.1000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:- 05.05.2024
అభ్యర్థులు ఇప్పటికే సమర్పించిన ఆన్‌లైన్ డేటా దిద్దుబాటు:- 04.05.2024 నుండి 06.05.2024 వరకు
రూ. 5000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:- 10.05.2024
రూ.10000/- ఆలస్య రుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ:- 12.05.2024
ఫీజు వివరాలు:-
ఓసీ అభ్యర్థులు రూ.600, బీసీ రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.500 చెల్లించాలన్నారు.
రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 30 వరకూ, రూ.1,000 ఫైన్తో మే 5 వరకూ, రూ.5 వేల ఫైన్తో మే 10 వరకూ, రూ.10 వేల ఫైన్ తో మే 12వ తేదీ సాయంత్రం వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
APAPCET 2024 పరీక్షల తేదీలు:-
(ఇంజనీరింగ్) 13.05.2024 నుండి 16.05.2024 వరకు
(వ్యవసాయం & ఫార్మసీ) 17.05.2024 నుండి 19.05.2024 వరకు.
ఏపీలో 47, హైదరాబాద్లో 1, సికింద్రాబాద్లో 1 చొప్పున ఆన్ లైన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.
మే 7 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. పరీక్షకు ప్రొఫెసర్ కె.వెంకటరెడ్డి కన్వీనర్ గా వ్యవహరిస్తున్నారని తెలిపారు.
వివరాలకు 0884-2359599, 0884-2342499 హెల్ప్ లైన్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
మరిన్ని వివరాలకు కింది వెబ్సైట్ ను సందర్శించగలరు.
https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_HomePage.aspx