మోడల్ స్కూల్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన
మోడల్ స్కూల్లల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన
అమరావతి, పీపుల్స్ మోటివేషన్:-
ఏపీలో ఆదర్శ (మోడల్) పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. రాష్ట్రవ్యాప్తంగా 164 మోడల్ స్కూల్స్ లో ప్రవేశాలకు మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ఆయా మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లోనే ఐదో తరగతి స్థాయి సిలబస్ తో తెలుగు/ఇంగ్లీషు మీడియంలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్కూల్స్ సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్నాయని.. ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే బోధన ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఓసీ/బీసీ విద్యార్థులు ₹150, ఎస్సీ/ఎస్టీ విద్యార్థులు ₹75 చొప్పున పరీక్ష ఫీజు చెల్లించాలి. ఆన్లైన్ https://apms.apcfss.in/లో ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో ఓసీ, బీసీ అభ్యర్ధులకు 35 మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు కనీసం 30 మార్కులు రావాలి. విద్యార్థుల ప్రతిభ, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్లను కేటాయిస్తారు. మరిన్ని వివరాలకు ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ లేదా సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారి/మండల విద్యాశాఖ అధికారిని సంప్రదించవచ్చని కమిషనర్ సూచించారు.
ఇంకా ఏదైనా సమాచారం కోసం సందర్శించగలరు అని తెలియజేశారు. https://apms.apcfss.in/