2024-25 సంవత్సరానికి కేజీబీవీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు దరఖాస్తు స్వీకరణ...
2024-25 సంవత్సరానికి కేజీబీవీల్లో ఆన్లైన్ అడ్మిషన్లు దరఖాస్తు స్వీకరణ...
6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు స్వీకరణ
దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 11
-సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు
అమరావతి, (పీపుల్స్ మోటివేషన్):-
సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నడుపబడుతున్న 352 కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) 2024-25 సంవత్సరానికి గాను 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం, 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు తేదీ 12.03.2024 నుండి తేదీ 11.04.2024 వరకు దరఖాస్తులు కోరడమైనది.
అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్ ( బడి మానేసిన వారు) పేద, ఎస్.సి, ఎస్.టి, బిసి, మైనారిటీ, బి.పి. ఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ కొరకు పరిగణింపబడతాయి. ఆన్లైన్ దరఖాస్తులు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా స్వీకరించబడతాయి. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుంది మరియు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో నేరుగా చూడవచ్చును. మరిన్ని వివరాలకు RTE Toll Free No 18004258599 ఫోన్ నంబర్లను సంప్రదించాల్సిందిగా రాష్ట్ర పథక సంచాలకులు బి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్ష ఇరవై వేలు, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఒక లక్షా నలభై వేలు మించకూడదు. అని సమగ్ర శిక్షా ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
అడ్మిషన్ల కొరకు కింది వెబ్సైట్ ను సందర్శించగలరు