గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు యువకుడు..సెల్ ఫోన్ లో చూచిరాత..
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కాపీ కొడుతూ పట్టుబడ్డాడు యువకుడు..సెల్ ఫోన్ లో చూచిరాత..
- గ్రూప్ 1 పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో వచ్చిన అభ్యర్థి..
- కాపీ కొడుతుండగా యువకుడిని పట్టుకున్న ఇన్విజిలేటర్..
- పోలీసులకు అప్పగించిన అధికారులు..
- ఒంగోలులోని ఓ పరీక్షా కేంద్రంలో ఘటన..
ఒంగోలు, మార్చి 17 (పీపుల్స్ మోటివేషన్):-
ఈరోజు ఏపీ వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఓ యువకుడు కాపీ కొడుతూ పట్టుబడ్డాడు. ఏకంగా పరీక్షా కేంద్రంలోకి సెల్ ఫోన్ తో వచ్చిన యువకుడు. ఫోన్ ద్వారా కాపీ కొడుతుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నారు.
ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పరీక్షా కేంద్రాల్లో గ్రూప్ 1 ఎగ్జామ్ ను అధికారులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఒంగోలులోని క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలోనూ పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులలో ఓ యువకుడు సెల్ ఫోన్ తో లోపలికి రావడం కలకలం రేపింది. పరీక్ష రాస్తున్న యువకుడి వద్ద సెల్ ఫోన్ ను గుర్తించిన ఇన్విజిలేటర్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పరీక్షలో కాపీ కొట్టేందుకు ఏకంగా సెల్ ఫోన్ తో రావడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించేటపుడు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సిన సిబ్బంది ఏంచేస్తున్నారని పలువురు అభ్యర్థులు మండిపడుతున్నారు.