-Advertisement-

ఆధార్ అప్డేట్ కు ముగుస్తున్న గడువు... మార్చి14 తర్వాత ఇక అంతే..

update aadhar card online my aadhaar aadhaar update status aadhar card download aadhaar update history aadhaar login aadhar card mobile number update
Peoples Motivation

ఆధార్ అప్డేట్ కు ముగుస్తున్న గడువు... మార్చి14 తర్వాత ఇక అంతే..

Aadhaar Card Free Update Last Date:-

ఆధార్ అప్డేట్ కు ముగుస్తున్న గడువు... ఉచితంగా ఆన్లైన్లో ఆధార్ కార్డు (Aadhaar Card) వివరాలు అప్డేట్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (UIDAI) మరోసారి పొడిగించింది. ముందుగా 2023 డిసెంబర్ 14 వరకు మాత్రమే ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మరో మూడు నెలలు గడువు పెంచింది. అంటే 2024 మార్చి 14 వరకు ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. ప్రజల నుంచి పాజిటివ్ స్పందన వస్తుండటంతో గడువు పెంచాలని నిర్ణయించినట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ(UIDAI) ఓ ప్రకటనలో తెలిపింది. గడువు తర్వాత ఆధార్ డాక్యుమెంట్లను అప్డేట్ చేసుకోవాలంటే ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఆధార్ కార్డు కోసం పేరు నమోదు చేసుకున్న నాటి నుంచి పదేళ్లు పూర్తయిన వారు తగిన పత్రాలు సమర్పించి అందులో పొందుపరిచిన వివరాలను అప్డేట్ చేసుకోవాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ గతంలో సూచించింది. ఇకపై ప్రతి ఒక్కరూ కనీసం పదేళ్లకోసారి గుర్తింపుకార్డు, చిరునామా ధ్రువీకరణ పత్రాలు సమర్పించి కేంద్ర గుర్తింపు సమాచార నిధి (సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపాజిటరీ- సీఐడీఆర్)లోని వివరాలను అప్డేట్ చేసుకోవాలని పేర్కొంది. ఈ ప్రక్రియ వల్ల పౌరుల సమాచారం సీఐడీఆర్ వద్ద ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందని, ఇది కచ్చిత సమాచారం నిక్షిప్తమవడానికి దోహదం చేస్తుందని తెలిపింది.

ఆధార్ తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు తమ డెమోగ్రఫిక్ వివరాలు, అడ్రస్ అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి లేటెస్ట్ గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సబ్మిట్ చేయాలి. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ ఫొటో పాస్బుక్, పాస్పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్ షీట్, పాన్/ ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడతాయని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్) తెలిపింది. విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా వినియోగించ్చుకోవచ్చని  భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ (ఉడాయ్) పేర్కొంది. ధ్రువీకరణ పత్రాలకు సంబంధించిన స్కాన్డ్ కాపీలను 'మై ఆధార్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.

చివరి తేదీ: మార్చి-14-2024

డెమోగ్రఫిక్ వివరాలు, అడ్రస్ అప్డేట్ కొరకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాలు:-

లేటెస్ట్ గుర్తింపు కార్డు,

రేషన్ కార్డు,

ఓటర్ ఐడీ,

కిసాన్ ఫొటో పాస్బుక్,

పాస్పోర్ట్.

టీసీ, మార్క్ షీట్, పాన్/ ఇ-ప్యాన్, డ్రైవింగ్ లైసెన్స్,

విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లు.

Thumbnails png Aadhar

Comments

-Advertisement-