ఫాం-12 ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
FORM 12 election pdf
Form 12 election duty Certificate
Election Form 12 filled sample
How to fill up Form 12 letter of intimation to Returning Officer
By
Peoples Motivation
ఫాం-12 ద్వారా ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం
విజయవాడ, (పీపుల్స్ మోటివేషన్):-
85 పైబడిన వారు, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లకు పోస్టల్ బ్యాలెట్ జారీకి కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. అలాగే, కోవిడ్ సోకిన వారికి కూడా పోస్టల్ బ్యాలెట్ జారీకి కూడా మరో నోటిఫికేషన్ జారీచేసింది. ఇక రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో 85 ఏళ్లు దాటిన ఓటర్లు 2,12,237 మంది ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్ అనేది వీరికి ఐచ్చికం. పోలింగ్ కేంద్రానికి వచ్చి కూడా ఓటు వేయవచ్చు. ఒకసారి పోస్టల్ బ్యాలెట్ కోసం ఫాం-12 పూరించి రిటర్నింగ్ అధికారికి ఇచ్చాక, ఆయన పోస్టల్ బ్యాలెట్ కు అనుమతించిన తరువాత అలాంటి వారు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం ఉండదు. అలాగే, శారీరక వైకల్యం ఉన్న ఓటర్లు కూడా పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోం ఓటింగ్కు చేసేందుకు అవకాశం ఉంటుంది. శారీరక వైకల్యం నిర్ధారించిన మేరకు ఉంటేనే రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ జారీకి అనుమతిస్తారు. ఇక పోస్టల్ బ్యాలెటుకు అనుమతి పొందిన వారు పోలింగ్ తేదీకి పది రోజుల ముందే వారి ఇంటి వద్దే ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. వీడియో గ్రాఫర్ తో సహా ఐదుగురు పోలింగ్ సిబ్బంది వారి ఇంటికి వెళ్లి ఓటు వేయిస్తారు. ఆ బ్యాలెట్ ను రెండు కవర్లలో ఉంచి పోలింగ్ బాక్సులో వేస్తారు.
Comments