Telangana 2024-25 budget#రైతులకు రూ. 2 లక్షల రుణమాపీపై ప్రకటన తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్
Telangana 2024-25 budget#రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాపీపై ప్రకటన.. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్
ఎన్నికల హామీలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం రూ. 53 వేల 196 కోట్లు..
ఇకనుంచి TS కాదు TG గా మార్పు..
త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్..
ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారింది
-డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క
Telangana ఓట్ ఆన్ అకౌంట్ Budget 2024-25
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25 ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి బడ్జెట్ ఇదే..
సుమారు 2.75 లక్షల కోట్ల వరకు రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రైతుబంధుతో పెట్టుబడిదారులు, అనర్హులు లాభపడ్డారని తెలిపారు. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని వెల్లడించారు. ఇక రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్న భూములకు కూడా రైతు బంధు ఇచ్చారుని మండిపడ్డారు. అలాంటి వారందరికి ఇప్పుడు రైతు బంధు ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇక 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ రూ. 2 లక్షల 75 వేల 891 కోట్లు. కేటాయించారు.
ఎన్నికల హామీలలో ఇచ్చిన ఆరు గ్యారంటీల కోసం రూ. 53 వేల 196 కోట్లు..
ఐటీశాఖకు రూ. 774 కోట్లు,
పరిశ్రమల శాఖకు(ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్) రూ. 2,543 కోట్లు,
పంచాయతీరాజ్ శాఖకు రూ. 40, 080 కోట్లు..
మున్సిపల్ శాఖకు రూ. 11,632 కోట్లు..
వ్యవసాయశాఖకు రూ. 19,746 కోట్లు,
విద్య రంగానికి రూ. 21, 389 కోట్లు..
రెవెన్యూ మిగులు రూ. 5, 944 కోట్లు..
వైద్య రంగానికి రూ. 11, 500 కోట్లు.
ద్రవ్యలోటు రూ. 32,557 కోట్లు..
ఎస్సీ, ఎస్టీ గురుకుల భవనాల కోసం రూ. 1,250 కోట్లు..
ఎస్సీ సంక్షేమం రూ. 21, 874 కోట్లు,
ఎస్టీ సంక్షేమం రూ. 13, 013 కోట్లు,
మైనార్టీ సంక్షేమం కోసం రూ. 2, 262 కోట్లు,
బీసీ సంక్షేమం రూ. 8000 కోట్లు..
గృహ నిర్మాణానికి రూ. 7,740 కోట్లు..
విద్యుత్-గృహ జ్యోతి పథకానికి రూ. 2, 418 కోట్లు..
విద్యుత్ సంస్థలకు రూ. 16, 825 కోట్లు..
నీటి పారుదలశాఖకు రూ. 28, 024 కోట్లు..
తెలంగాణలో పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటుకు రూ. 500 కోట్లు..
యూనివర్సిటీల్లో సదుపాయాలకు రూ. 500 కోట్లు..
మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కోసం రూ. 1000 కోట్లు..
ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 10 లక్షలకు పెంపు..
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3.500 ఇళ్లు.. ఇందిరమ్మ ఇళ్లకు బడ్జెట్ లో రూ. 7,740 కోట్లు..
రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాపీపై త్వరలోనే కార్యాచరణ,విధివిధానాలు ఖరారు చేయబోతున్నామన్నారు. రూ.500లకే గ్యాస్ సిలిండర్.. 200 వరకు ఉచిత విద్యుత్ అమలు చేస్తామన్నారు. అర్హులకే రైతు బంధు ఇస్తాం.. రైతు బంధు నిబంధనలు పున: సమీక్ష చేస్తామన్నారు. ఎకరాకు రూ. 15 వేలు ఇవ్వబోతున్నాం.. కౌలు రైతులకు కూడా రైతు బంధు ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
ఇకనుంచి TS కాదు TG గా మార్పు..
ఇక నుంచి వాహన రిజిస్ట్రేషన్ కోడ్ ను TS నుంచి TGగా మార్పు చేశామన్నారు. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళనకు సత్వర చర్యలు తీసుకున్నామని.. ధరణి పోర్టల్ పై అధ్యయనం చేయడానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ధరణి కొంతమందికి భరణంగా మరికొంత మందికి ఆభరణంగా, చాలా మందికి భారంగా మారిందని తెలిపారు. గత ప్రభుత్వ తప్పులతో ఎంతోమంది సొంత భూమిని కూడా అమ్ముకోలేక పోయారని తెలిపారు. TSPSC రూ. 40 కోట్లు.. త్వరలో మెగా డీఎస్సీ ఉంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నకిలీ విత్తనాల సమస్య ఉండేది.. నకిలీ విత్తనాలతో మోసపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు.
త్వరలో 15 వేల పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్..
జ్యాబ్ క్యాలెండర్ ను తయారు చేస్తున్నామని, త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలు వెల్లడించనున్నాట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసర్లను నియమించామని, త్వరలోనే ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణాన్ని ప్రారంభిస్తామన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షల సాయం అందిస్తున్నాట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయాలన్నది మా లక్ష్యం అన్నారు. గురుకుల పాఠశాలల సొసైటీ ద్వారా రెండు ఎంబీఏ కళాశాలల ఏర్పాటు చేయబోతున్నాం.. నాణ్యమైన విద్య అందించాలన్నదే మా ధ్వేయమన్నారు. రాచరిక ఆనవాళ్లతో ఉన్న రాష్ట్ర చిహ్నాన్ని మారుస్తామన్నారు. రాజ్యంగ స్పూర్తితో ప్రజాస్వామ్యం, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కొత్త చిహ్నం ఏర్పాట్లు చేస్తున్నాట్లు తెలిపారు.