SR Junior College యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి ఆత్మహత్య
SR Junior College యాజమాన్యం నిర్లక్ష్యంతో విద్యార్థి ఆత్మహత్య
కర్నూలు, ఫిబ్రవరి 17 (పీపుల్స్ మోటివేషన్):-
కర్నూలు పట్టణంలోని స్థానిక జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల ప్రక్కన ఉన్న SR జూనియర్ కళాశాలలో ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ గ్రామం రైతు కుటుంబానికి చెందిన సైఫుల్లా పెద్ద కుమారుడు ఇర్ఫాన్ బాషా (16) అనే ఇంటర్మీడియట్ MPC విద్యార్థి ర్యాగింగ్ పేరుతో వేధించబడుతున్న కళాశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ పట్టించుకోని నిర్లక్ష్య కారణంగా మనోవేదన చెందినటువంటి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నేటికీ జిల్లా ఉన్నతాధికారులు విద్యార్థులను ఎటువంటి ర్యాగింగ్ నేపథ్యాలు లేకుండా అనేక సెమినార్లు నిర్వహిస్తున్నాము అన్నప్పటికీ ఇలాంటి కార్పొరేట్ విద్యాసంస్థలకు పర్మిషన్లు ఇవ్వడం కారణంగా విద్యార్థులు నిరంతరం ఆత్మహత్యకు లోనవుతున్నారు. ప్రస్తుతం ఇర్ఫాన్ అనే ఇంటర్మీడియట్ MPC ఫస్టియర్ చదువుతున్నటువంటి విద్యార్థి ఆత్మహత్యకు ప్రధాన కారణం అయినటువంటి వ్యక్తిగా కళాశాల ప్రిన్సిపాల్ అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్తున్నారు. కేవలం రాష్ట్రంలో ఇటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఒకటి రెండు ర్యాంకులు అని యాడ్స్ రూపంలో చెప్పుకుంటున్నప్పటికీ SR Junior College కూడా అలాగే మార్కుల వేటలో విద్యార్థులను బలితీసుకున్న వైనం నేడు కనిపిస్తుంది. విద్యాసంస్థలు తల్లిదండ్రులనుండి దాదాపు లక్షలకు పైగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం వారి పిల్లల యొక్క సమాచారాన్ని కూడా తల్లిదండ్రులకు చేరవేయని వైఖరి విద్యాసంస్థలలో చూస్తున్నాం. ఫీజుల విషయంలో కావచ్చు ఆట స్థలంలో విషయంలో కావచ్చు ఉన్నటువంటి నియమ నిబంధనలకు విరుద్ధంగా ప్రస్తుతం RIO బాధ్యత వహించాలి. మృతికి కారణమైనటువంటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అలాగే కళాశాల గుర్తింపును రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. తాలుకా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశామని మృతికి గల కారణాలపై విచారణ చేసి చర్యలు తీసుకుంటామని సీఐ శ్రీధర్ తెలిపారు.